Nara Bhuvaneswari | గుంటూరు : టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన భార్య నారా భువనేశ్వరితో కలిసి ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నారా లోకేశ్, ఆయన భార్య బ్రహ్మాణి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కాబట్టి అఘాయిత్యాలు ఆగాలంటే టీడీపీకి ఓటేయాలి. మహిళా ఓటర్లు అందరూ తమ ఇండ్ల నుంచి బయటకు రావాలని, ఓటు హక్కు వినియోగించుకుని ప్రస్తుత ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. ఎందుకంటే టీడీపీ ఎల్లప్పుడూ ప్రజలకు మద్దతుగా ఉంటుందని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు.