Friday, April 4, 2025
HomeCinemaNaresh| తొలిసారి ప‌విత్ర‌ని ప్రేమించ‌డం గురించి నోరు విప్పిన న‌రేష్‌

Naresh| తొలిసారి ప‌విత్ర‌ని ప్రేమించ‌డం గురించి నోరు విప్పిన న‌రేష్‌

Naresh| విజయ నిర్మల కొడుకు.. సీనియర్ నటుడు నరేష్ ఒక‌ప్పుడు హీరోగా ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా అద‌ర‌గొడుతున్నారు. ఆయ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మూడు పెళ్లిళ్లు చేసుకొని హాట్ టాపిక్ అయ్యారు. అయితే మూడు పెళ్లిళ్లు క్యాన్సిల్ కావ‌డంతో పవిత్ర లోకేష్‌ని ప్రేమించారు. ఆమె కూడా న‌రేష్‌కి ఓకే చెప్ప‌డంతో ఇద్ద‌రు క‌లిసి ఉంటున్నారు. అయితే వీరిద్ద‌రూ జంట‌గా ‘మ‌ళ్ళీ పెళ్లి’ అనే సినిమా తీశారు. దీంతో అసలు నరేష్, పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకున్నారా? అని సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. రివేంజ్ కోస‌మే నేను ‘మ‌ళ్ళీ పెళ్లి’ సినిమా తీశానంటూ సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. ప్ర‌తీకారం కోసం అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టి సినిమా ఎంద‌కు తీయాలి. ఓ యూట్యూబ్‌లో వీడియో పెట్టొచ్చు. లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు అని లాజిక్స్ చెప్పారు న‌రేష్‌.

అయితే ప్రస్తుతం నరేష్ వయసు 64 ఏళ్ళు. పవిత్ర లోకేష్ వయసు 45 ఏళ్ళు. ఈ వయసులో నరేష్ పవిత్ర ప్రేమలో పడడానికి కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. కానీ పవిత్ర.. ఆస్తి కోసమే నరేష్ ని ప్రేమించిందా అనే విమ‌ర్శ‌లు కూడా వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరి మధ్య ఇంత ఎమోషనల్ బాండింగ్ ఏర్పడడానికి కారణాన్ని తాజాగా నరేష్ బయట పెట్టారు. మా అమ్మ విజయ నిర్మల పుట్టిన రోజు.. పవిత్ర లోకేష్ పుట్టినరోజు ఫిబ్రవరి 20 నే అని నరేష్ తెలిపాడు. ప్రకృతి ఆ విధంగా నాకు సిగ్నల్ పంపింది అంటూ పవిత్ర లోకేష్ తో ప్రేమ గురించి తెలిపాడు. అత్త కోడళ్ల పుట్టిన రోజులు కలవడం చాలా అరుదు. ఆ మిరాకిల్ తన లైఫ్ లో జరిగిందని నరేష్ అంటున్నాడు.

మా అమ్మ అంటుండేది.. నీకు అన్నీ ఇచ్చాను రా.. కానీ మంచి పార్ట్నర్ ని ఇవ్వలేకపోయాను అని బాధపడేది. పవిత్ర లోకేష్ నా లైఫ్ లో కి వచ్చిన తర్వాత మా అమ్మకి ఒక మాట చెప్పా. అప్పుడు ఆమె అనారోగ్యంతో చివరి దశలో బెడ్ పై ఉన్నారు. నా పార్ట్నర్ గురించి నువ్వు దిగులు పడకు. మంచి వ్యక్తి నా లైఫ్ లోకి వచ్చింది. ధైర్యంగా ఉండు అని చెప్పినట్లు నరేష్ పేర్కొన్నాడు. పవిత్ర కూడా మా అమ్మ లాంటి వ్యక్తే. చాలా స్ట్రాంగ్ వుమెన్ అంటూ నరేష్ ప్రశంసలు కురిపించారు. నరేష్ కి పవిత్ర నాలుగవ పార్ట్నర్ కాగా.. పవిత్ర ఆల్రెడీ ఒకసారి వివాహం చేసుకుంది. కాగా ప‌విత్ర‌పై ఆమె భ‌ర్త సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం మనం చూశాం.

RELATED ARTICLES

తాజా వార్తలు