Hyper Aadi| హైపర్ ఆది.. ఇప్పుడు ఈ పేరు చెబితే ముఖం మీద కాస్త చిరునవ్వు రావడం ఖాయం. ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ స్థాయికి వచ్చిన హైపర్ ఆది ఇప్పుడు స్టార్ కమెడీయన్‌గా ఉన్నాడు. జబర్ధస్త్ షోతో హైపర్ ఆది దశ తిరిగిపోయింది అని చెప్పాలి. టీవీ షోస్, సినిమాలు, రాజకీయాలు ఇలా క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. అయితే హైపర్ ఆది చాలా షార్ట్ టైంలో మంచి క్రేజ్ దక్కించుకోగా,ఆయనని ఒకప్పుడు తొక్కేసే ప్రయత్నం జరిగిందని ప్రచారాలు జరగాయి. తాజాగా జబర్ధస్త్ కమెడీయనే హైపర్ ఆదిని తొక్కేసే ప్రయత్నం చాలా రోజుల నుండి చేస్తున్నాడట.
అవకాశం రావడంతో కసి తీర్చుకున్నాడట. ఈ విషయాన్ని తాజాగా రివీల్ చేశాడు. అయితే హైపర్ ఆదిని తొక్కేసే ప్రయత్నం చేసింది మరెవరో కాదు జబర్దస్త్ నరేష్. పొట్టి నరేష్‌గా పేరు తెచ్చుకున్న ఇతను జబర్ధస్త్‌తో పాటు ఇతర షోలలో కూడా ఎంత కామెడీ పండిస్తారో మనం చూస్తూనే ఉన్నాం. నరేష్, హైపర్ ఆది మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో మనం స్క్రీన్‌పైన చూస్తూనే ఉంటాం. నరేష్ గురించి చాలా సందర్భాల్లో గొప్పగా చెప్పాడు ఆది. అలాంటి హైపర్ ఆదినే నరేష్ తొక్కేయాలనుకోవడం ఆశ్చర్యంగా మారింది.
మేటర్‌లోకి వెళితే ప్రముఖ టీవీ షో `శ్రీదేవి డ్రామా కంపెనీ` లేటెస్ట్ ఎపిసోడ్ విడుదలైంది. ఇందులో బాహుబలి సినిమాలో ప్రభాస్ పై నుండి రాజమాత నడుచుకుంటూ వెళుతున్న సీన్ మాదిరిగా ఓ సీన్ పెట్టారు. హైపర్ ఆది పై నుంచి నరేష్ నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ మధ్యలో మెడపై కాలేసి తొక్కుతూ కాసేపు ఊపుతాడు. దాంతో ఆది కింద పడిపోతాడు. అప్పుడు `ఒక్క కాలు దానిపై(టేబుల్) పెట్టావు, మరో కాలు నాపై పెట్టి తొక్కుతున్నావ్ ఎందుకురా అని అడిగాడు ఆది. ఎప్పటికైన నిన్ను తొక్కాలనేది నా ఆశ` అంటూ నరేష్ చెప్పిన విధానం నవ్వులు పూయించింది. కామెడీగా ప్రదర్శించిన ఈ సంఘటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.