Naveen Chandra| టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర గురించి ప్రత్యేకమైన పరిచయాలు అక్కర్లేదు.ఆయన మొదట్లో హీరోగా చేసి ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నాడు. ఆయన కొన్ని సినిమాలు ప్రేక్షకులకి తెగ నచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాది ఆయన నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ అనే సినిమా పెద్ద హిట్ అయింది. ఈ చిత్రంలో నవీన్ చంద్రతో పాటు స్వాతి, శ్రావ్య నవేలి, జ్ఞానేశ్వరి, హర్ష.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకాంత్ నగోతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా విమర్శకుల ప్రశంసలు దక్కించుకొని పలు అవార్డ్స్‌కి కూడా ఎంపికైంది.
అయితే 14వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల కార్యక్రమం ఇటీవల జరగగా, ఈ వేడుకలో మంత్ ఆఫ్ మధు సినిమాలో అద్భుతమైన నటనకు గాను నవీన్ చంద్ర బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. బెస్ట్ మెల్ యాక్టర్ అవార్డు నవీన్ చంద్రకి దక్కగా, తాను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. ఇక నవీన్ చంద్రకి పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలాంటి అవార్డ్‌లు మరెన్నో అందుకోవాలని విష్ చేస్తున్నారు. అయితే తన భర్తకి అవార్డ్ దక్కడం పట్ల నవీన్ చంద్ర భార్య చాలా సంతోషించింది. నవీన్ చంద్ర భార్య ఓర్మా ఎయిర్ పోర్ట్‌లో సర్‌ప్రైజ్ ఇచ్చి సంతోషం వ్యక్తం చేసింది.
భర్త వస్తున్నాడని తెలుసుకున్న ఓర్మా బొకే తీసుకువెళ్లి ఎయిర్ పోర్ట్ లో వెయిట్ చేసింది . అప్పుడు నవీన్ చంద్ర రావడం, తన భార్య బొకేతో కనిపించడం చూసి అంతా సినిమా స్టైల్‌లో నడిచింది. ఆ తర్వాత నవీన్ చంద్ర అవార్డుని భార్యకు తీసి చూపించాడు. ఆ తర్వాత ఇద్దరూ కూడా ప్రేమగా కౌగలించుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోని నవీన్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. చాలా సంతోషం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఆ జంటని చూసి పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు