Lok Sabha Elections | న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో దశ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆరో దశలో 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగింది. మొత్తం 889 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇక ఫలితాలు తేలాల్సి ఉంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.
ఈ 58 నియోజకవర్గాల్లో దాదాపు 59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 78 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 54.03 శాతం, బీహార్‌లో 53.19 శాతం, ఢిల్లీలో 54.37 శాతం, హర్యానాలో 58.24 శాతం, ఒడిశాలో 59.92 శాతం, జార్ఖండ్‌లో 62.66 శాతం పోలింగ్ నమోదైంది. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ – రాజౌరి లోక్‌సభ నియోజకవర్గంలో 51 శాతం పోలింగ్ నమోదైంది. 1989 తర్వాత ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి అని ఎన్నికల అధికారులు వెల్లడించారు.