Roja| నగరి నుండి రెండు సార్లు గెలిచిన రోజా మూడో సారి బొక్కబోర్లా పడింది. హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్న ఆమెకి నిరాశే ఎదురైంది. రోజా ఓటమికి ఆమె నోటిదూలే కారణం అనే వారు లేకపోలేదు. రజినీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలని పురస్కరించుకొని ఒకసారి విజయవాడకి వచ్చారు. అప్పుడు రజినీకాంత్, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని ప్రశంసించారు. అందుకు కారణం వారిద్దరికి ఎప్పటి నుండో మంచి స్నేహం ఉంది. రజినీకాంత్ ఎప్పుడూ చంద్రబాబు పరిపాలనని ప్రశంసిస్తూ వుంటారు. అలాగే అప్పట్లో విజయవాడ వచ్చిన రజినీకాంత్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు, అలాగే ఆ తరువాత చంద్రబాబు గురించి ఎంతో గొప్పగా మాట్లాడేరు కూడా.
రజినీకాంత్ ఎన్టీఆర్ పైన, చంద్రబాబుపైన ప్రశంసలజల్లు కురిపించటంతో మంత్రి రోజా, కొడాలి నాని ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. తమిళ సూపర్ స్టార్ అని కాని, తోటి నటుడు అని కాని చూడకుండా రజినీకాంత్ సినిమాలలో హీరో కానీ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో జీరో అయ్యారని, ఇన్నాళ్లు రజినీకాంత్ సంపాదించుకున్న పేరును పోగొట్టుకున్నారు అంటూ రోజా విమర్శించారు. అసలు రాజకీయాలే వద్దనుకున్న రజినీకాంత్ మళ్లీ రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నాడో చెప్పాలంటూ రోజా వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన మాటలపై ఆయన సరిదిద్దుకుని ప్రకటన విడుదల చెయ్యాలని రోజా వ్యాఖ్యానించారు. మరోవైపు రజినీకాంత్ సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నాడు అని, మూడు రోజులు షూటింగ్ చేస్తే, నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండే రజినీకాంత్ తెలుగు ప్రజలకు ఏం చెబుతాడని, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ రజినీకాంత్ దిగజారిపోతున్నాడు అంటూ దారుణంగా తిట్టిపోసారు.
అయితే ఈ విమర్శల తర్వాత రజనీకాంత్ ఓ ఈవెంట్ లో మొరగని కుక్క ఉండదు, విమర్శించని నోరు ఉండదు, ఈ రెండూ లేని ఊరు ఉండదు, అయినా మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. అర్థమైందా రాజా’, అని చెప్పారు. రజినీకాంత్ మాటలు అప్పుడు వైరల్ అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు నెటిజన్స్ అదే వీడియోని పెట్టి వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో రోజా, కొడాలి నాని అప్పట్లో చెప్పిన మాటలు, తరువాత రజినీకాంత్ చెప్పిన మాటలు కూడా ఎడిట్ చేసి వీడియోలు పెడుతూ నెట్టింట తెగ
వైరల్ అయ్యేలా చేస్తున్నారు.