Monday, December 30, 2024
HomeNationalBride Kidnapped | నవ వధువును ఎత్తుకెళ్లిన దుండగులు..! రంగంలోకి పోలీసులు

Bride Kidnapped | నవ వధువును ఎత్తుకెళ్లిన దుండగులు..! రంగంలోకి పోలీసులు

Bride Kidnapped | బంధువుల సమక్షంలో పెళ్లి వేడుక బ్రహ్మాండంగా జరిగింది. పెళ్లి తంతు పూర్తయ్యాక నవ దంపతులను ఊరేగింపు నిర్వహించారు. ఈ వింతలో అనుకోని ఘటన ఎదురైంది. సాయుధులైన దుండగులు సంఘటనా స్థలానికి చేరుకొని వధువును ఎత్తుకువెళ్లారు. ఈ ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. పోలీసులు రంగంలోకి దిగి.. విచారణ చేపట్టినా ఇప్పటి వరకు వధువు ఆచూకీ దొరకలేదు. ఈ ఘటన గుజరాత్‌ దాహోద్‌ జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిత్‌ అమలియార్‌ (23) అనే వ్యక్తికి ఉష (22) అనే యువతితో పెళ్లి జరిగింది.

ఆదివారం రాత్రి వివాహం అనంతరం వధూవరులను ఊరేగించారు. ఈ ఊరేగింపు నవగ్రామ్‌కు చేరుకుంది. ఇంతలోనే సాయుధులైన 15 మంది దుండగులు కారును అడ్డుకున్నారు. ఆ తర్వాత నవ వధువు ఉషను కిడ్నాప్‌ చేశారు. దీంతో ఖంగుతిన్న వరుడు రోహిత్‌.. ఆ తర్వాత తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా కిడ్నాప్‌కు సూత్రధారులంటూ ఐదుగురి పేర్లను వెల్లడించారు.. వీరితో పాటు మరో పది మంది సైతం కిడ్నాప్‌లో పాల్గొన్నట్లుగా తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనలో పాల్గొన్న ఎనిమిది మంది నిందితులను గుర్తించారు.

ఇందులో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో మహేశ్ భూరియాను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్టు దహోద్ డివిజన్ డీఎస్పీ జగదీశ్‌సింగ్ భండారీ తెలిపారు. నవ వధువు ఉష, నిందితులు దూరపు బంధువులని తెలిపారు. మహేశ్ కజిన్ ఒకరు ఉష కుటుంబంలోని వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని.. ఉషను కిడ్నాప్ చేసిన నిందితుడు మధ్యప్రదేశ్ వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నారు. అక్కడి పోలీసులతో సమన్వయం చేస్తున్నామని.. నిందితులకు పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా వివరించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు