Niharika| మెగా బ్రదర్ నాగబాబు ముద్దులు కూతురు నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించి సందడి చేసిన నిహారిక ఆ తర్వాత హీరోయిన్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.అయితే సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవడంతో ఈ భామ పెళ్లి పీటలెక్కింది. పెద్దలు చూపించిన జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకొని కొన్నాళ్ల పాటు అతనితో సంసారం సజావుగానే సాగింది. అయితే ఆ సంసారం ఎక్కువ కాలం సాగలేదు. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల వలన విడాకులు తీసుకొని ఎవరికి వారు ఒంటరిగా ఉంటున్నారు.
అయితే విడాకుల దగ్గర నుండి నిహారికపై తెగ ట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది. విడాకుల తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో చాలా మంది ఆమెని విమర్శిస్తూ ఉంటారు. అయితే ట్రోలర్స్‌కి నిహారిక గట్టిగానే బదులు ఇస్తుంటుంది. దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పి ఏంటో తెలుస్తోంది. పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని.. నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నట్టు ఓ సందర్భంలో తెలియజేసింది నిహారిక. ఇటీవల నిహారిక రెండో పెళ్లి గురించి అనేక ప్రచారాలు సాగాయి. అయితే వాటన్నింటిని పట్టించుకోని నిహారిక తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది.
అయితే తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. తనని విమర్శించే వారికి గట్టిగా సమాధానం ఇచ్చింది. మిమ్మల్ని ఎవరైన విమర్శిస్తే మీరు ఎలా తీసుకుంటారని ప్రశ్నించగా, నేను చాలా లైట్ తీసుకుంటాను. పొగిడితే పొంగిపోను. తిడితే కుంగిపోను అని చెప్పుకొచ్చింది. అయితే మీపై చాలా ట్రోలింగ్ జరుగుతుందిగా, దానిని మీరు ఎలా తీసుకుంటారు అని యాంకర్ అడగ్గా దానికి స్పందించిన నిహారిక నేను ఎవరి గురించి పట్టించుకోను. నాకు నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫాదర్, బ్రదర్ ఉన్నారు. వారు నా ప్రపంచంగా బావిస్తాను. మిగతా వాళ్లు ఏమి అనుకున్నా ఎలాంటి కామెంట్స్ చేసిన పెద్దగా పట్టించుకోను అని నిహారిక చెప్పుకొచ్చింది. మిగతా వారు ఏమనుకున్నా నా వెంట్రుకతో సమానం అన్నట్టు తన హెయిర్ ని చూపించింది. ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి.