Thursday, April 3, 2025
HomeNationalకేరళలో నిఫా వైరస్ కలకలం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

కేరళలో నిఫా వైరస్ కలకలం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన గంటలోనే ఒక బాలుడు మృతి

(జ‌న‌ప‌దం, న్యూఢిల్లీ)

  • కేరళలో నిఫా వైరస్(Nipha Virus) కలకలం… రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
  • వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన గంటలోనే ఒక బాలుడు మృతి
  • కేరళకు ప్రత్యేక వైద్యబృందాన్ని పంపిన కేంద్రం
  • ప్రభావిత ప్రాంతాల్లో క్వారంటైన్ ఏర్పాట్లు చేయాలంటూ కేంద్రం ఆదేశాలు

ప్రమాదకరమైన నిఫా వైరస్ భారత్ లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే కేరళలో ఓ బాలుడు నిఫా వైరస్ సోకి మృత్యువాత పడ్డాడు. వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన గంటలోనే బాలుడు మృతి చెందడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇది ప్రాణాంతకమైన వైరస్ కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. నిఫా వైరస్ వ్యాప్తి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. నిఫా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న చోట క్వారంటైన్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

నిఫా వైరస్ తొలిసారిగా 1999లో వెలుగులోకి వచ్చింది. అయితే దీనికి వ్యాక్సిన్ లేదు. ఇది జంతువుల ద్వారా మనుషులకు సోకుతుంది. 2018లో కేరళలో ఈ వైరస్ బారినపడి 27 మంది మృతి చెందారు. తాజాగా, కేరళలో మరోమారు నిఫా కలకలం రేగడంతో, కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక వైద్య బృందాన్ని కేరళకు పంపింది.

RELATED ARTICLES

తాజా వార్తలు