Jabardasth| పటాస్ షోతో బుల్లితెరకి పరిచయమై జబర్ధస్త్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో నూకరాజు ఒకడు. అతని బాడీ లాంగ్వేజ్, టైమింగ్‌కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అతను జబర్ధస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కనిపిస్తూ తెగ సందడి చేస్తూ ఉంటాడు. అతని కామెడీని ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే నూకరాజుకి ఆసియా అనే లవర్ ఉండగా, ఈ జంటకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరు కలిసి పలు సందర్భాలలో వెరైటీ స్కిట్స్ చేస్తూ కామెడీని పండిస్తుంటారు. అయితే తన లవర్ దగ్గర నూకరాజు అడ్డంగా బుక్కయ్యాడు. ఫోన్‌ని ఆసియాకి ఇవ్వగా ఆమె ఇతని బాగోతం చూసి ఒక్కసారిగా షాక్‌లో పడింది.
మేటర్‌లోకి వెళితే లవ్ టుడే చిత్రంలో మాదిరి ఆసియా, నూకరాజు తమ మొబైల్స్ మార్చుకున్నారు. ఇక నూకరాజు మొబైల్ ని చెక్ చేసింది. అందులో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగా ఒక అమ్మాయి.. ‘ఏయ్, రిప్లై ఇవ్వు’ అని పంపిన మెసేజ్ ఉంది. ఇది చూసిన ఆసియా… నీకు ఎంత క్లోజ్ కాకపోతే అలా మెసేజ్ పెట్టిందంటూ నూకరాజుపై సీరియస్ అయింది. అప్పుడు నూకరాజు నేను రిప్లై ఇవ్వలేదుగా అని అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఆ తర్వాత ఆసియా నూకరాజు ఫేక్ బుక్ కూడా ఓపెన్ చేసింది. అందులో కూడా ఆ అమ్మాయి పంపిన మెసేజులు ఉన్నాయి. హాయ్ బర్త్ డే విషెస్ చెప్పు అని కామెంట్ పెట్టి లవ్ సింబల్స్ జోడించింది.
ఇక ఇది చూసి ఆసియా.. నూకరాజుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. ఇక కోపంతో నూకరాజు మైక్ విసిరేసి వెళ్లిపోతాడు. ప్రస్తుతం వారద్దరికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. అయితే రియల్ ఇన్సిడెంటా, లేకుంటే శ్రీదేవి డ్రామా కోసం చేసిన ఫన్‌నా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే జబర్ధస్త్ షో ద్వారా పరిచయం అయి ప్రేమలో పడ్డ ప్రవీణ్, ఫైమా విడిపోయారు. ఇప్పుడు నూకరాజు, ఆసియా కూడా ఇలానే విడిపోతారా ఏంటి అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.