Friday, April 4, 2025
HomeCinemaNTR-VIRAT| విరాట్ కోహ్లీ- ఎన్టీఆర్ వీడియో కాల్స్ మాట్లాడుకునేంత క్లోజా..బ‌య‌ట‌కు వ‌చ్చిన షాకింగ్ డీటైల్స్

NTR-VIRAT| విరాట్ కోహ్లీ- ఎన్టీఆర్ వీడియో కాల్స్ మాట్లాడుకునేంత క్లోజా..బ‌య‌ట‌కు వ‌చ్చిన షాకింగ్ డీటైల్స్

NTR-VIRAT| యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ర‌న్‌మెషీన్ విరాట్ కోహ్లీలకి దేశ వ్యాప్తంగా ఎంత‌టి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌రు న‌ట‌న‌తో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోగా, ఇంకొక‌రు క్రికెట్‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు. అయితే విరాట్ కోహ్లీ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంది. త‌న‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ మంచి స్నేహితుడిని అని, గ‌తంలో ఇద్ద‌రం క‌లిసి ఒక యాడ్ చేశామని, వీలుంటే మ‌రో సారి క‌లిసి న‌టిస్తామంటూ విరాట్ కోహ్లీ అన్నాడు. తార‌క్ నాకు మంచి స్నేహితుడు కాగా, న‌టుడిగా ఆయ‌న‌ని ఎంతో అభిమానిస్తాన‌ని తెలియ‌జేస్తాడు.

ఎన్టీఆర్‌తో న‌టించేట‌ప్పుడు తార‌క్ వ్య‌క్తిత్వాన్ని చూసి ఫిదా అయ్యారు. తారక్ ఆప్యాయంగా మాట్లాడే తీరు నాకు ఎంతో న‌చ్చుతుంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్ప‌డానికి మాట‌లు స‌రిపోవు. మూవీలోని నాటు నాటు సాంగ్‌కి అనుష్క‌, నేను రీల్ చేశాం. గ్రౌండ్‌లో కూడా ప‌లు సంద‌ర్భాల‌లో ఆ పాటకి స్టెప్పులేశాను. ఇక తార‌క్‌తో వీలున్న‌ప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడుతాను అంటూ విరాట్ చెప్పాడు. ఇప్పుడు ఎన్టీఆర్, విరాట్ మ‌ధ్య స్నేహం గురించి తెలుసుకున్న ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక విరాట్ ఇప్పుడు టీ20 ప్ర‌పంచ క‌ప్ కోసం తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ఆర్సీబీ త‌ర‌పున ఐపీఎల్‌లో ఆడి సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు

ఇక ఎన్టీఆర్ విష‌యానికి వ‌స్తే.. ‘దేవర’ అనే హై రేంజ్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. అదే సమయంలో బాలీవుడ్‌లో నేరుగా ‘వార్ 2’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి న‌టిస్తున్నాడు. స్పై యూనివర్శ్ నుంచి వచ్చి సక్సెస్ అయిన ‘వార్’ మూవీకి ఇది కొనసాగింపుగా రాబోతుంది. ఇద్దరు పాన్ ఇండియా రేంజ్ హీరోలు నటిస్తోన్న ‘వార్ 2’ మూవీని హై రేంజ్ యాక్షన్‌తో తీస్తున్నారు. అంతేకాదు, దీన్ని ఇండియా వ్యాప్తంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మ‌రింత పెర‌గ‌నుంద‌ని అంటున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు