Friday, April 4, 2025
HomeNationalSambit Patra | పూరీ జగన్నాథుడు మోదీ భక్తుడు..! బీజేపీ నేత సంబిత్‌ పాత్ర వివాదాస్పద...

Sambit Patra | పూరీ జగన్నాథుడు మోదీ భక్తుడు..! బీజేపీ నేత సంబిత్‌ పాత్ర వివాదాస్పద వ్యాఖ్యలు..

Sambit Patra | ఒడిశా బీజేపీ నేత, పూరీ పార్లమెంట్‌ అభ్యర్థి సంబిత్‌ పాత్ర చేసిన వ్యాఖ్యలు వివాస్పదస్పదమయ్యాయి. ఏకంగా ఒడిశా ముఖ్యమంత్రి సైతం సంబిత్‌ పాత్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీజేపీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని.. ఈ విషయాన్ని పెద్దది చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని మోదీ ఒడిశా పూరీ జగన్నాథుడిని దర్శించుకొని.. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంబిత్‌ పాత్ర మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘ఇవాళ ప్రధాని మోదీని చూసేందుకు లక్షల మందికి వచ్చారు. జగన్నాథుడు కూడా మోదీ భక్తుడే. మనమంతా మోదీ కుటుంబీకులమే. ఒడిశా ప్రజలకు ఇంత ముఖ్యమైన రోజున నేను భావోద్వేగాన్ని అణచుకోలేకపోతున్నా’ను అంటూ వివాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, పూరీ జగన్నాథుడిని మోదీ భక్తుడు అనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన వ్యాఖ్యలపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తీవ్రంగా స్పందించారు. ‘ఒడిశా ఆత్మాభిమానానికి మహాప్రభు పూరీ జగన్నాథ్ చిహ్నం. పూరీ జగన్నాథుడు ఓ మనిషికి భక్తుడని వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నాను.

మహాప్రభును రాజకీయాల్లోకి లాగొద్దని నేను బీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వ్యాఖ్యలు ఒడియా ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి. దీన్ని వారు చాలాకాలం పాటు గుర్తుపెట్టుకుంటారు’ అంటూ తీవ్రంగా స్పందించారు. దీనిపై సంబిత్‌ పాత్ర స్పందిస్తూ పొరపాటున ఈ వ్యాఖ్యలు వచ్చాయని.. చిన్న విషయాన్ని పెద్దది చేయొద్దని కోరారు. గతంలో టీవీ ఇంటర్వ్యూలో జగన్నాథుడి భక్తుడు మోదీ అని చెప్పానన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు