OTT| థియేటర్స్‌లో సందడి తగ్గింది.. ఓటీటీలో వైవిధ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్నాయి. ఈ వారం థియేటర్స్‌లో మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా ఓటీటీలో కూడా మంచి కంటెంట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి, కార్తీకేయ భజేవాయు వేగంతో పాటు ఆనంద్ దేవరకొండ గం గం గణేశా చిత్రాలు థియేటర్స్‌లో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఓటీటీ విషయానికి వస్తే తెలుగు కన్నా హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.
ఈ వారం మొత్తంగా 19 వెబ్ సిరీస్, సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో చాలామంది ఇంట్రస్టింగ్‌గా ఎదురు చూస్తున్న మూవీ వీర్ సావర్కర్. ఈ సినిమా కోసం కొన్ని వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మే 27 నుండి జూన్ 2 వరకు వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజయ్యే మూవీస్ వివరాలు చూస్తే.. అమెజాన్ ప్రైమ్..లో పంచాయత్ సీజన్ 3 (హిందీ సిరీస్)- మే 28 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ది లైఫ్ యూ వాంటెడ్ (ఇటాలియన్ వెబ్ సిరీస్)- మే 29, గీక్ గర్ల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 30, ఎరిక్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 30, ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ మూవీ)- మే 31, రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ వెబ్ సిరీస్)- మే 31, లంబర్ జాక్ ది మాన్‌స్టర్ (జపనీస్ చిత్రం)- జూన్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది.
ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో చూస్తే.. కామ్డేన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 29, ది ఫస్ట్ ఒమన్ (ఇంగ్లీష్ హారర్ మూవీ)- మే 30, ఉప్పు పులి కారమ్ (తమిళ వెబ్ సిరీస్)- మే 30, జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 31 నుండి స్ట్రీమింగ్ కానున్నాయి. జియో సినిమా ఓటీటీలో ఇల్లీగల్ సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్)- మే 29, దేద్ బిగా జమీన్ (హిందీ మూవీ)- మే 31, లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 31, ది లాస్ట్ రెఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 31, ఏలీన్ (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 1 నుండి స్ట్రీమ్ కానున్నాయి. జీ5 ఓటీటీలో చూస్తే.. స్వాతంత్య్ర వీర్ సావర్కర్ (హిందీ చిత్రం)- మే 28 నుండి, హౌజ్ ఆఫ్ లైస్ (హిందీ వెబ్ సిరీస్)- మే 31 నుండి, స్ట్రీమింగ్ అవుతాయి. సైనా ప్లే ఓటీటీలో పొంబలై ఒరుమై (మలయాళ చిత్రం)- మే 31 నుండి స్ట్రీమింగ్ కానుంది.