Saturday, January 4, 2025
HomeCinemaOTT| ఈ రోజు ఓటీటీ ప్రియుల‌కి పండ‌గే పండ‌గ‌.. ఎన్ని సినిమాలు విడుద‌ల కాబోతున్నాయంటే..!

OTT| ఈ రోజు ఓటీటీ ప్రియుల‌కి పండ‌గే పండ‌గ‌.. ఎన్ని సినిమాలు విడుద‌ల కాబోతున్నాయంటే..!

OTT| శుక్ర‌వారం వ‌చ్చిందంటే సినీ ప్రియుల‌కి పండ‌గే అని చెప్పాలి. ఒక‌వైపు థియేట‌ర్స్, మ‌రో వైపు ఓటీటీలో కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్.. ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచ‌డానికి గాను ప‌లు ఓటీటీ సంస్థ‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌లని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తుంటాయి.అయితే మాములు రోజుల‌లో కూడా ఓటీటీల‌లో సినిమాలు రిలీజ్ అయిన ఫ్రైడే రోజు మాత్రం ఎక్కువ సినిమాల‌తో పాటు స్పెష‌ల్ చిత్రాల‌ని రిలీజ్ చేస్తుంటారు. ఈ వారం ఓటీటీల్లోకి సినిమాలు, వెబ్ సిరీసులు కలుపుకుని 21కిపైగా స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే మే 10న ఏకంగా 14 సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

ముందుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో చూస్తే.. లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ చిత్రం)- మే 10, బ్లడ్ ఆఫ్ జీసస్ సీజన్ 2 (వెబ్ సిరీస్)- మే 10, కుకింగ్ ఆప్ మర్డర్: అన్‌కవరింగ్ ది స్టోరీ ఆఫ్ సీజర్ రోమన్ (డాక్యుమెంట్ సిరీస్)- మే 10, ది అల్టిమేటమ్: సౌతాఫ్రికా (రియాలిటీ షో)- మే 10న స్ట్రీమింగ్ కానున్నాయి.ఇక జీ5 ఓటీటీలో 8 ఏఎమ్ మెట్రో (హిందీ చిత్రం)- మే10న‌, పాష్ బాలిష్ (బెంగాలీ వెబ్ సిరీస్)- మే 10న స్ట్రీమింగ్ కానుంది. జియో సినిమా ఓటీటీలో మర్డర్ ఇన్ మహిమ్ (హిందీ వెబ్ సిరీస్)- మే 10 న‌, ప్రెట్టీ లిటిల్ లయర్స్: సమ్మర్ స్కూల్ – మే 10న స్ట్రీమింగ్ కానుంది.ఇక రోమియో (తమిళ సినిమా)- ఆహా తమిళ్- మే 10 స్ట్రీమింగ్ అన్‌దేకి సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- మే 10 స్ట్రీమింగ్, ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే- మే 10 స్ట్రీమింగ్, ఫ్యూచర్ పొండాటి (తమిళ వెబ్ సిరీస్)- సన్ నెక్ట్స్ ఓటీటీ- మే 10 స్ట్రీమింగ్ కానుంది.

ఇక బయోస్పియర్- హుళు ఓటీటీ- మే 10 స్ట్రీమింగ్, చాల్చిత్ర ఏఖాన్- హోయ్‌చోయ్ ఓటీటీ- మే 10 స్ట్రీమింగ్ కానున్నాయి. వీట‌న్నింటిలో 8ఏఎమ్ మెట్రో స్పెషల్‌గా ఉండనుంది. ఈ సినిమాను మల్లేశం సినిమా డైరెక్టర్ రాజ్ రాచకొండ ..మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన అందమైన జీవితం నవల ఆధారంగా తెర‌కెక్కించారు.ఇక బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ తొలిసారిగా నటించిన రొమాంటిక్ సినిమా రోమియో కూడా స్పెషల్‌గా ఉండనుంది. మర్డర్ ఇన్ మహిమ్, అన్‌దేకి సీజన్ 3 వెబ్ సిరీసులు కూడా ఆక‌ట్టుకుంటాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు