OU CPGET | హైదరాబాద్ : రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. ఈ మేరకు సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఈనెల 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. జూన్ 17వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 500 ఆలస్య రుసుంతో జూన్ 25 వరకు, రూ. 2 వేల ఆలస్య రుసుంతో జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 5వ తేదీ నుంచి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షలన్నీ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.