Friday, April 4, 2025
HomeCinemaPallavi Prashanth| ఇచ్చిన మాట త‌ప్పి, ల‌గ్జ‌రీలు ఎంజాయ్ చేస్తున్న రైతు బిడ్డ‌.. ఫైర్ అవుతున్న...

Pallavi Prashanth| ఇచ్చిన మాట త‌ప్పి, ల‌గ్జ‌రీలు ఎంజాయ్ చేస్తున్న రైతు బిడ్డ‌.. ఫైర్ అవుతున్న నెటిజ‌న్స్

Pallavi Prashanth| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్ర‌మం తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ షో ఇప్ప‌టికే ఏడు సీజ‌న్స్ పూర్తి చేసుకోగా ఇప్పుడు ఎనిమిదో సీజ‌న్ కోసం సన్న‌ద్ద‌మ‌వుతుంది. అయితే సీజ‌న్ 7 అన్ని సీజ‌న్స్ క‌న్నా ప్ర‌త్యేకంగా నిలిచింది. ఈ సీజ‌న్‌లో కామ‌న్ మ్యాన్ క‌ప్ కొట్ట‌డం తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్‌గా మారింది. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన‌ పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షల నగదు బహుమతిని అందుకున్నాడు. రూ. 50 లక్షలు ప్రైజ్ మనీ కాగా… ప్రిన్స్ యావర్ 4వ స్థానంలో రూ. 15 లక్షలు తీసుకుని రేసు నుంచి త‌ప్పుకోవ‌డంతో ప్ర‌శాంత్ బ‌హుమ‌తిలో కోత ప‌డింది. అయితే ప్ర‌శాంత్‌కి న‌గ‌దుతో పాటు ఒక కారు, నెక్లెస్ కూడా ఇచ్చారు.

మారుతీ సుజుకీ బ్రీజా కారు ధర రూ. 15 లక్షలు కాగా, నెక్లెస్ ధర కూడా రూ. 15 లక్ష్లలు. ఈ బహుమతులు పల్లవి ప్రశాంత్ కి వెంటనే ఇవ్వలేదు. షో ముగిసిన ఐదు నెలలకు జాన్ అలుకాస్ ప్రకటించిన నెక్లెస్ పల్లవి ప్రశాంత్ కి అందజేయ‌డంతో ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పల్లవి ప్రశాంత్ తెలియజేశాడు. అయితే పల్ల‌వి ప్రశాంత్‌కి ద‌క్కిన రూ. 35 లక్షలు పేద రైతులకు పంచుతానని బిగ్ బాస్ స్టేజ్‌పై తెలియ‌జేశాడు.అయితే టాక్స్ కటింగ్స్ పోను పల్లవి ప్రశాంత్ కి రూ. 16 లక్షలు రాగా, వాటిని తాను పేద‌ల‌కి పంచ‌కుండా ల‌గ్జ‌రీ ఖ‌ర్చులు చేస్తున్నాడు.

తాజాగా ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ మారుతీ సుజుకీ చెందిన రెడ్ కలర్ ఓపెన్ టాప్ ల‌గ్జ‌రీ కారును సొంతం చేసుకున్నాడు. దీనికి సంబందించిన వీడియో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఇందులో ప్ర‌శాంత్ త‌న గురువు శివాజీతో క‌లిసి షోరూంకి వెళ్లాడు. కారు డెలివ‌రీ త‌ర్వాత డ్రైవ్ చేశాడు. ఇక ఓపెన్ టాప్ నుండి ఈ పరిణామం కొందరికి కాలుతుంది అన్నాడు. సామాన్యుడు పైకి రావాలని అన్నాడు. స‌రే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా మ‌నోడు రైతులకి డ‌బ్బులు పంచుతాన‌ని చెప్పి ఇలా ల‌గ్జ‌రీగా ఎంజాయ్ చేయ‌డం జ‌నాల‌కి న‌చ్చ‌డం లేదు. నెలలు గడుస్తున్నా మరొక సాయం చేయకపోవ‌డంతో ప్రశాంత్‌ని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ప్ర‌శాంత్ ఏమైన స్పందిస్తాడా అన్న‌ది చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)

RELATED ARTICLES

తాజా వార్తలు