న్యూఢిల్లీ: వచ్చే నెలాఖరు నాటికి పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం (PAN Aadhaar Link) చేసుకోవాలని, అలాగైతేనే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండవని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్‌తో శాశ్వత అకౌంట్ నంబర్ (పాన్) లింక్ అవ్వకపోతే సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్ మినహాయింపులుంటాయి. అయితే లావాదేవీ సమయంలో పాన్ ఇన్‌ఆపరేటివ్‌లో ఉన్న పన్ను చెల్లింపుదారులకు టీడీఎస్ లేదా టీసీఎస్ షార్ట్ డిడక్షన్ లేదా కలెక్షన్ ఎగవేతకు పాల్పడినట్లుగా నోటీసులు వస్తున్నాయని సీబీడీటీ వెల్లడించింది.
ఈ మేరకు తమకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొన్నది. అయితే అలాంటి కేసుల్లో మే 31కల్లా ఆధార్‌తో పాన్ అనుసంధానం కాకపోయినా సాధారణ రేటుకే టీడీఎస్/టీసీఎస్ వసూలుంటుందని సీబీడీటీ స్పష్టం చేసింది.
కాగా, 2022 జూన్ 30 వరకు ఆధార్‌తో పాన్ అనుసంధానం ఉచితంగానే జరిగింది. జూలై 1 నుంచి 2023 జూన్ 30 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో అనుమతించారు. అప్పటికీ లింక్ అవ్వని పాన్ జూలై 1 నుంచి ఇన్‌ఆపరేటివ్‌లోకి వెళ్లింది. దీన్ని ఆపరేషన్‌లోకి తేవాలంటే రూ.1,000 ఫైన్ కట్టాల్సిందే. కానీ 30 రోజుల సమయం పడుతుంది. ఆధార్, పాన్ లింక్ కాకపోతే ఐటీ రిఫండ్ ఉండదు. లింక్ చేసుకుంటే రిఫండ్ వస్తుంది. కానీ, ఆలస్యానికి ఐటీ శాఖ నుంచి వడ్డీ రాదు. అందువల్ల ట్యాక్స్ పేయర్స్ వెంటనే మీ ఆధార్‌ను పాన్ కార్డు నంబర్‌తో అనుసంధానం చేయండి.