Thursday, January 2, 2025
HomeCinemaChandrakanth| పవిత్ర మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక కన్నుమూసిన చంద్ర‌కాంత్.. వీరి ల‌వ్ స్టోరీ మాములుగా లేదు..!

Chandrakanth| పవిత్ర మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక కన్నుమూసిన చంద్ర‌కాంత్.. వీరి ల‌వ్ స్టోరీ మాములుగా లేదు..!

Chandrakanth|  త్రినయని సీరియల్ ఫేమ్ పవిత్ర జయరామ్ కొన్ని రోజుల క్రితం కారు ప్రమాదంలో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే . ఆమె మ‌ర‌ణ వార్త‌ని జీర్ణించుకోలేని న‌టుడు చంద్ర‌కాంత్ శుక్ర‌వారం రాత్రి ఆత్మ‌హ‌త్య చేసుకొని మ‌రో పెద్ద షాక్ ఇచ్చాడు. కొద్ది గ్యాప్‌లోనే ఇద్ద‌రు టీవీ ఆర్టిస్ట్‌లు చ‌నిపోవ‌డం ఇండ‌స్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే చాలా మంది ప‌విత్ర భ‌ర్త చంద్ర‌కాంత్ అని అనుకుంటున్నారు. కాని ఇంకా వారు పెళ్లి చేసుకోలేదు. ప్ర‌స్తుతం పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నారు. పెళ్లి చేసుకుందాం అని అనుకున్న స‌మ‌యంలో క‌న్నుమూసారు. పవిత్ర, చంద్రకాంత్ ల లవ్ స్టోరీ ఏంటి? వారి మ‌ధ్య ప‌రిచ‌యం, ప్రేమ ఎప్పుడు ఏర్ప‌డింది అనే విష‌యాలు నెట్టింట చక్క‌ర్లు కొడుతున్నాయి.

త్రినయని సీరియల్ చేస్తున్న క్రమంలో ప‌విత్ర‌-చంద్ర‌కాంత్‌ల ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది ఆ త‌ర్వాత ప్రేమ‌గా మారింది. ప‌విత్ర కొన్ని కార‌ణాల వ‌ల‌న త‌న భర్త నుండి విడిపోయి ఒంట‌రిగా ఉంటుంది. ఇక చంద్రకాంత్ కు సైతం పెళ్లి కాగా, అత‌డు త‌న భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ ఇద్దరు త‌మ జీవితంలోని పాత విష‌యాల‌ని మ‌ర‌చిపోయి కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. దాదాపు 5 సంవత్సరాల నుంచి వీరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఇద్దరూ ఒక్కటౌవ్వాలని అనుకున్నారు. తమ జంట గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకున్నా తమ ప్రేమ పవిత్రమైనదని పెళ్లి ద్వారా ఈ ప్రపంచానికి తెలియజెప్పాల‌ని భావించారు. కాని ప‌విత్ర కారు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డం, అది తట్టుకోలేక చంద్రకాంత్ సైతం ఆత్మహత్య చేసుకోడంతో వారి ప్రేమ విషాదంగా మారింది.

చంద్రకాంత్‌ భార్య పేరు శిల్ప కాగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరికి ఐదేళ్లు,మ‌రొకరికి ఆరేళ్ల వయసు. ఇక చంద్రకాంత్‌-శిల్ప ఇద్దరిది కూడా లవ్‌ మ్యారేజ్‌. 11 ఏళ్ల క్రితం తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా సరే.. చంద్రకాంత్‌ను వివాహం చేసుకుంది శిల్ప. ఇప్పుడు తన అత్తమామతో కలిసి ఉంటుంది. అయితే ప‌విత్ర ప‌రిచ‌యం కావ‌డం వ‌ల్ల‌నే చంద్ర‌కాంత్.. శిల్ప‌ని వ‌దిలేసాడ‌నే టాక్ ఉంది. పవిత్ర మీద పిచ్చి ప్రేమతో.. ఆమె లేని లోకంలో ఉండలేనంటూ చంద్రకాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రకాంత్‌ తీసుకున్న నిర్ణయం వల్ల అతడి తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు అన్యాయం అయ్యారు. వారి బాగోగోలు ఇప్పుడు ఎవ‌రు చూడాలి. ఎవ‌రు అండ‌గా ఉంటారు అనేది ప్ర‌శ్నార్ధ‌కంగ మారింది.

RELATED ARTICLES

తాజా వార్తలు