Pawan Kalyan| ఏపీలో ఈ సారి రాజకీయం ఎంత రక్తి కట్టిందో మనం చూశాం. వైసీపీ ఒకవైపు బీజేపీ-టీడీపీ-జనసేన మరోవైపు. ప్రచార కార్యక్రమాలలో ఒకరిపై ఒకరు ఎలాంటి విమర్శలు చేసుకున్నారో చూశాం. ఇప్పుడు పోలింగ్ సమయం వచ్చింది. ఏపీ ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకి వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలు కాగా, ఇది సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతుంది. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతితో ఉదయాన్నే వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భాకరాపురంలో ఆయన ఓటు వేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరితో కలిసి ఓటు వేశారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ఓటర్లు బారులు తీరి నిల్చోవడంతో తనవంతు వచ్చేంత వరకూ పవన్ కళ్యాణ్ క్యూ లైన్‌లోనే నిల్చున్నారు. అనంతరం ఓటు వేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్ నిలుచోగా ఆయన మంగళగిరిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పిఠాపురంలో పవన్‌కి ఓటు హక్కు లేదు. అందుకే మంగళగిరి వెళ్లి ఓటు వేసి వచ్చారు. పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి పోలింగ్ బూత్‌కి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
#WATCH | Andhra Pradesh: Jana Sena Party chief Pawan Kalyan casts his vote at a polling booth in Mangalagiri
Voting for Andhra Pradesh Assembly elections and the fourth phase of #LokSabhaElections2024 are taking place simultaneously today. pic.twitter.com/PkKfhGRpfJ
— ANI (@ANI) May 13, 2024