Monday, December 30, 2024
HomeCinemaPawan Kalyan| ఏంటి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఆ సినిమాని రామ్ చ‌ర‌ణ్ వంద సార్లు...

Pawan Kalyan| ఏంటి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఆ సినిమాని రామ్ చ‌ర‌ణ్ వంద సార్లు చూశాడా..!

Pawan Kalyan| చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆన‌తి కాలంలోనే త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఇప్పుడు ఏ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మ‌నంద‌రం చూస్తూనే ఉన్నాం. ప‌వ‌న్ సినిమాల‌లో కొన్ని సినిమాలు ఎన్ని సార్లు చూసిన బోర్ రాదు. అయితే ప‌వ‌న్ ఇప్పుడు న‌టుడిగానే కాకుండా రాజ‌కీయ నాయ‌కుడిగా కూడా స‌త్తా చాటుతున్నాడు. ఈ సారి పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ అక్క‌డ త‌ప్ప‌క గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు.ఈ క్రమంలో జోరుగా ప్ర‌చారాలు కూడా చేశాడు. ఇక ఆయ‌న‌కి మ‌ద్దతుగా ఇండ‌స్ట్రీ నుండి, కుటుంబం నుండి చాలా మంది మ‌ద్దుతుగా నిలిచారు. నిన్న రామ్ చ‌రణ్ త‌న తల్లితో క‌లిసి పిఠాపురం వెళ్లి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని క‌లిసారు.

చాలా రోజుల త‌ర్వాత ప‌వ‌న్, రామ్ చ‌ర‌ణ్‌ని ఒకే ఫ్రేములో చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రికి సంబంధించి అనేక వార్త‌ల‌ని నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చ‌ర‌ణ్ త‌న లైఫ్‌లో ఒకే ఒక్క సినిమాని వంద సార్లు చూశాడ‌ట‌. అది కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన చిత్రం. ఆ మూవీ మ‌రేదో కాదు ‘ఖుషి ‘… ఇక ఈ సినిమాను చరణ్ ఇప్పటివరకు ఒక 100 సార్లు చూశారని ఆయన ఫ్రెండ్స్ ప‌లుమార్లు చెప్పుకొచ్చారు. ఖుషీ సినిమాలో ప‌వ‌న్ యాక్టింగ్‌, సాంగ్స్‌, సినిమా స్టోరీ రామ్ చ‌ర‌ణ్‌కి బాగా న‌చ్చ‌డంతో అన్ని సార్లు చూసాడ‌నే టాక్ ఉంది. రామ్ చ‌ర‌ణ్ కూడా ప‌లు ఇంట‌ర్వ్యూలలో ఖుషీపై ప్ర‌శంస‌లు కురిపించ‌డం మ‌నం చూశాం.

పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ‘ఖుషీ’ సినిమాకు ప్రత్యేక స్థానం త‌ప్ప‌క ఉంటుంది. ఈ సినిమా అంటే పవన్ అభిమానులకు పూనకం వ‌చ్చేస్తుంది. ఇప్ప‌టికీ ఈ సినిమా టీవీల‌లో వ‌స్తే మిస్ కాకుండా చూస్తుంటారు. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఏ.ఎమ్.రత్నం నిర్మించిన ‘ఖుషీ’ సినిమాలో సరసన భూమిక నటించింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ యూత్‌కు చాలా ద‌గ్గ‌ర‌య్యారు.ముఖ్యంగా సిద్దు సిద్ధార్ధ రాయ్ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు అప్పటి యూత్‌కి ఎంత‌గానో క‌నెక్ట్ అయ్యాయి. అంతేకాదు ఆయ‌న మేన‌రిజాన్ని కూడా అనుక‌రించ‌డం చేశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు