Friday, April 4, 2025
HomeCinemaPawan Kalyan| నిక్క‌రులో ప‌వన్ క‌ళ్యాణ్‌.. భ‌లే క్యూట్‌గా ఉన్నాడుగా..!

Pawan Kalyan| నిక్క‌రులో ప‌వన్ క‌ళ్యాణ్‌.. భ‌లే క్యూట్‌గా ఉన్నాడుగా..!

Pawan Kalyan| ప‌వ‌న్ క‌ళ్యాణ్ టాలీవుడ్ స్టార్ హీరో..ఆయ‌న సినిమాలు చేస్తున్న‌ప్పుడు కేవ‌లం ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో మాత్ర‌మే కనిపించేవాడు. కాని రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాక నిత్యం జనాల‌లోనే ఉంటూ వారి మ‌ధ్యే తిరుగుతూ స‌మ‌స్య‌ల‌పై యుద్ధం చేస్తున్నాడు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ఎమ్మెల్యేగా చూడాలని ఆయ‌న అభిమానులు ఎంత‌గానో ఆశ‌ప‌డుతున్నారు. పవన్ కల్యాణ్ ఈ సారి పిఠాపురం నుండి పోటీ చేస్తుండ‌గా, ఈ నియోజ‌క‌వ‌ర్గం అందరి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ గెలుపు కోసం ఎన్డీయే కూటమి, మెగా ఫ్యామిలీ, అభిమానులు, బుల్లితెర ఆర్టిస్ట్‌లు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నారు. రోజు రోజుకి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మ‌ద్ద‌తు పెరుగుతూ పోతుంది.. సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా పవన్‌ కళ్యాణ్‌ గెలుపు కోసం ప్ర‌చారం చేస్తుండ‌గా, రీసెంట్‌గా బ‌న్నీ కూడా ఆ లిస్ట్‌లో చేరారు.

ఎన్నికల ప్రయాణంలో చాలా బిజీగా ఉన్న ప‌వ‌న్ కల్యాణ్‌గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆయన ఎంచుకున్న మార్గాన్ని, అందులో ఆయన చూపించే డెడికేష‌న్ చూసి ఎప్పుడు గ‌ర్విస్తుంటాను. కుటుంబ స‌భ్యుడిగా నా ప్రేమ‌, మ‌ద్దతు మీకు త‌ప్ప‌క ఉంటుంది. మీరు ఈ ఎల‌క్ష‌న్స్‌లో గెలుపొందాల‌ని, మీరు అనుకున్న కోరిక నెర‌వేరాల‌ని కోరుకుంటున్నాను అని అల్లు అర్జున్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ప‌వన్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల ప్ర‌చారంతో బిజీగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌కి సంబంధించి రేర్ ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో ప‌వ‌న్ నిక్క‌ర్‌తో క‌నిపించ‌డం విశేషం.

ఆ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా ఉన్నారు.మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ డ్రెస్ వేసుకొని నిల‌బ‌డ‌గా, ఆయ‌న ప‌క్క‌న నాగ‌బాబు వైట్ ష‌ర్ట్‌, బ్లాక్ ప్యాంట్ ధరించి ఉన్నారు. ఇక చిరంజీవి చెల్లెలు, సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌ల్లి కూడా ఆ ఫొటోలో మ‌నం చూడ‌వ‌చ్చు. ఆమె సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా చీర‌క‌ట్టులో క‌నిపించారు. అయితే అంద‌రిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లుక్ ప్ర‌తి ఒక్క‌రిని ఆకర్షిస్తుంది. పొట్టి నిక్క‌రులో మ‌నోడు ఇచ్చిన పోజులు మెగా ఫ్యాన్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు