Sunday, December 29, 2024
HomeCinemaMultistarrer|ఈ వార్త ఊహ‌కే అంద‌డం లేదుగా.. ప‌వ‌న్, ప్ర‌భాస్ కాంబోలో మ‌ల్టీ స్టార‌ర్

Multistarrer|ఈ వార్త ఊహ‌కే అంద‌డం లేదుగా.. ప‌వ‌న్, ప్ర‌భాస్ కాంబోలో మ‌ల్టీ స్టార‌ర్

Multistarrer| ఒక‌ప్పుడు స్టార్ హీరోలు క‌లిసి క‌ట్టుగా సినిమాలు చేయ‌డం చాలా అరుదు. కాని ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలు ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు క‌లిసి క‌ట్టుగా వ‌స్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వంటి స్టార్ హీరోలు క‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్ర‌భంజ‌నం సృష్టించడంతో ఇప్పుడు మ‌రి కొంత మంది స్టార్ హీరోలు కూడా క‌లిసి ప‌ని చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే ఈ స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు సుజీత్ మాట్లాడుతూ.. సుజీత్ మాట్లాడుతూ.. కుదిరితే పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో ఓ మల్టీస్టారర్ చేయాలని ఉందని తెలిపాడు. ఇక సుజీత్ కామెంట్స్‌తో ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తున్నారు.

సినిమాటిక్ యూనివ‌ర్స్ తీసుకొచ్చి అదిరిపోయే భారీ మ‌ల్టీ స్టార‌ర్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. నిజంగా ఆ ప‌ని చేస్తే మాత్రం నీకు రుణ‌ప‌డిపోతాం అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు..`భజేవాయువేగం` మూవీ ప్రమోషన్‌లో భాగంగా కార్తికేయతో చిట్‌చాట్‌ చేశాడు దర్శకుడు సుజీత్‌. ఈ సందర్భంగా `ఓజీ` అప్‌డేట్‌ ఇచ్చాడు. అలాగే, పవన్‌, ప్రభాస్‌లతో మల్టీస్టారర్‌ చేయాలనేది తన డ్రీమ్‌ అని చెప్పుకొచ్చాడు. మ‌రి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కార్య‌రూపం దాల్చుతుంది, ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యే విష‌య‌మేనా అని కొంద‌రు ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

డైరెక్టర్ సుజీత్ గతంలో ప్రభాస్ తో సాహో అనే సినిమా తీసి ప్రేక్ష‌కులని అలరించాడు. తెలుగులో ఈ మూవీకి అంత ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. హిందీలో మాత్రం మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. అయితేఆ సినిమాలో స్టైలిష్, లుక్స్, టేకింగ్ అదిరిపోయాయి. ఇందులో యాక్ష‌న్ సీన్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. ఇక ఇప్పుడు ప‌వన్ క‌ళ్యాణ్‌తో ఓజీ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవ‌ల ఈ సినిమా నుండి వ‌చ్చిన గ్లింప్స్ అంచ‌నాలు భారీగా పెంచాయి. ఈ మూవీతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లోని కొత్త కోణం ఆవిష్క‌రించ‌బోతున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. గ‌త కొద్ది రోజులుగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పాలిటిక్స్‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న షూటింగ్ కి బ్రేక్ ప‌డింది. ప్రస్తుతం మూవీని త్వ‌ర‌గా పూర్తి చేసే ప‌నిలో ఉన్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు