Saturday, December 28, 2024
HomeTelanganaFamily Survey | సవాళ్ల సర్వే..

Family Survey | సవాళ్ల సర్వే..

సవాళ్ల సర్వే…
ఊరికి రాకండి.. వెళ్లిపోండి
సర్కారుకు షాక్
సమగ్ర కుటుంబ సర్వేకు ఊహించని అనుభవం
ఎక్కడికక్కడ నిలదీస్తున్న జనం..
ఎన్యూమరేటర్లకు చుక్కలు..
అన్నేసి పేజీలు నింపలేక సిబ్బంది ఇబ్బంది..
అంత డాటా ఎంట్రీ సాధ్యమయ్యేనా అనే అనుమానం..
వెళ్లగొట్టిన రెండు గ్రామాలు

సర్వే.., ఓ సవాల్. ప్రశ్నలు వీళ్లను వాళ్లేస్తున్నారా.., వాళ్లను వీళ్లు అడుగుతున్నారా.. తెలియదు కానీ, మొత్తంగా అనుమానాల దండయాత్ర దండిగా సాగుతున్నది. ఎందుకోసం, ఏమవసరం., ఇప్పుడెందుకు., గతంలోనూ పొడిచారుగా.., మళ్లీ ఏం పొడ్వడానికి.., అనే కోణంలో జనం సర్వే అంటేనే మొహం మొత్తినట్టుగా భావించి ఎదురు తిరుగుతున్నారు. ఏ సర్కార్ చరిత్ర చూసిన ఏమున్నది అన్నట్టుగా., ఎవరి పట్టింపులకు వాళ్లు పోయి మధ్యలో మమ్మల్ని ఫుల్స్ ను చేస్తున్నారనే అభిప్రాయంతో ప్రజలు సర్వేకు సహకరించడానికి అంగీకరించడం లేదు. సమగ్ర సర్వే కాస్త సవాళ్ల సర్వే అన్నట్టుగా ఎన్యుమరేటర్లంతా నెత్తిగోక్కోవాల్సిన దుస్థితి. చిత్రవిచిత్రమైన అనుభవాలు, జనం నుంచి ఎదురవుతున్న ప్రశ్నల ప్రతిదాడులు., ఏం సమాధానం చెప్పాలో తెలియక మధ్యలోనే వెళ్లే అవకాశాలు లేక ఎవరికొచ్చిన సర్వేరా భగవంతుడా… అన్నట్టుగా నెట్టుకొస్తున్నారు.

===================

జనపదం, బ్యూరో

సమగ్ర సర్వే సవాళ్లతో ముందుకు సాగుతున్నది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఇస్తున్న షాక్ లకు సిబ్బందికి మైండ్ బ్లాంక్ అవుతున్న సందర్భాలు. ఒక్కో కుటుంబానికి సుమారు ఏడేసి పేజీలు నింపడానికి అపసోపాలు పడడం ఒకెత్తైతే., అన్ని ప్రశ్నలకు కుటుంబ పెద్ద ఓపిగ్గా సమాధానం చెప్పే పరిస్థితులు లేకపోవడం మరో ఎత్తుగా మారింది. ఎన్యూమరేటర్లకు కనీసంగా కూడా సహకరించడానికి కూడా ఇష్టపడడం లేదంటే జనం ఎంత మొహం మొత్తి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ మొదలవగా..శనివారం నుంచి ఇంటింటి కుటుంబ సర్వే మొదలైంది. అయితే.. ఈ కుటుంబ సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్లకు రకరకాల అనుభవాలు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల బూతులు తిడుతూ బెదిరిస్తుంటే.. మరికొన్ని చోట్ల పెంపుడు కుక్కలను ఉసిగొల్పుతున్నారు. ఇక్కడైతే ఏకంగా కుటుంబ సర్వేనే బహిష్కరించారు. రెండు గ్రామాల ప్రజలకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి అధికారులకు షాక్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ఆ కుటుంబ వివరాలు సేకరిస్తూ సర్వే సాగిస్తున్నారు. ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఓ గ్రామం బహిష్కరించింది. ఇందుకు సంబంధించి గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి అధికారులకు అందించారు. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్, గుండంపెల్లి గ్రామాల్లోని ప్రజలు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను బహిష్కరించారు. ఈ సర్వేను బహిష్కరించటం వెనుక బలమైన కారణమే ఉంది. దిలావర్పూర్- గుండంపెల్లి గ్రామాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా.. దానికి వ్యతిరేకంగా రెండు గ్రామాల ప్రజలు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. కానీ.. ప్రభుత్వం ఏమాత్రం స్పదించకపోవటంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే.. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుల గణన సర్వే ప్రారంభం కాగా.. సర్వే నిర్వాహణ కోసం ఎన్యూమరేట్రలు గ్రామాల్లోకి వెళ్లగా.. ప్రజలు వారిని అడ్డుకున్నారు. తమ గ్రామాలకు హాని కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడి నుంచే ఎత్తేంసే వరకు ఎలాంటి సర్వేలకు సహకరించేది లేదని గ్రామస్థులు తెగేసి చెప్తున్నారు. అధికారులకు తాము ఎలాంటి వివరాలు చెప్పేది లేదని.. తమ ఊరి నుంచి వెళ్లిపోవాలంటూ చెప్పుకొచ్చారు. ఫ్యాక్టరీని తరలించే వరకు సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించేది లేదని గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేసి అక్కడి అధికారులకు అందజేశారు. దీంతో.. చేసేదేమి లేక అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఇదిలా ఉంటే.. ఇంటింటి సర్వే కోసం వెళ్తున్న ఎన్యుమరేటర్లకు పలు ప్రాంతాల్లో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లకు ఊహించిన పరిణామాలు ఎదురయ్యాయి. కొన్నిచోట్ల ఎన్యుమరేటర్లను సెక్యురిటీ సిబ్బంది ఇంటి లోపలికి అనుమతించడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో సర్వే సిబ్బందిపైకి పెంపుడు కుక్కలను వదులుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

భాగ్యనగరంలో..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయని.. అన్ని ఇండ్లను 87,092 ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లుగా విభజించినట్లు ప్రణాళిక శాఖ వివరించింది. రాజధాని హైదరాబాద్‌లో మొత్తం 28,32,490 కుటుంబాలు ఉండగా వీటిని 19,328 ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లుగా విభజించారు. సర్వే కోసం 94,750 మంది ఎన్యూమరేటర్లను.. వారిపై 9,478 మంది సూపర్‌వైజర్లను రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది.

RELATED ARTICLES

తాజా వార్తలు