Saturday, December 28, 2024
HomeTelanganaGo Back HYDRAA | నాశనగాలం..?

Go Back HYDRAA | నాశనగాలం..?

JanaPadham_EPaper_28-09-2024

Janapadham EPaper 28.09.2024-3PM News

నాశనగాలం..?

రేవంత్ సర్కార్ పై దుమ్మెత్తిపోస్తున్న జనం..
పెద్దోళ్లను వదిలి.. పేదలపై ప్రతాపమని మండిపాటు..
దూకుడుకు తట్టుకోలేక ఆగుతున్న గుండెలు..
ఇల్లు కూలుస్తారనే కంగారుతో మహిళా ఆత్మహత్య..
ఎక్కడికక్కడ నిరసనలు., రాస్తారోకోలు.., బైఠాయింపులు..
మూసీ పరివాహమంతా ఉద్రిక్త వాతావరణం..
పలుచోట్ల చేతులెత్తేసిన పోలీసులు..
రంగనాథ్ కు హైకోర్టు మొట్టికాయలు..
హైడ్రాతో సర్కార్ కు అపఖ్యాతి..

‘‘ఏం నాశనగాలానికి ఇదంతా చేస్తున్నావ్. మేమేం పాపం చేశాం. బుక్కెడు తినికూడా తృప్తిగా పండనియ్యవా..? నువ్వేదో పొడుస్తావని ఓట్లేస్తే., మా కొంపలే కూల్చి రోడ్డున పడేస్తున్నావ్ కదా..? నీ పాపం ఊరికే పోదు., మట్టికొట్టుకుపోతావ్., మమ్మల్ని కలకల అనిపిస్తున్న నువ్వు మాకన్నా పదింతల కుళ్లికుళ్లి పోతావ్. నీ సర్కార్ మాయిల్లమే కూల్తది. ఏ ముఖ్యమంత్రి చెయ్యని పని చేస్తానని విర్రవీగుతున్నవేమో. నీ అంత లుచ్చాపని మరెవ్వరు చెయ్యరు. నువ్వో ముఖ్యమంత్రివి., నీదో సర్కార్.. నాశనమైపోతవ్..’’ అని జనం రేవంత్ తీరుపై మండిపడుతున్నారు. హైడ్రా అంటూ డ్రామాలాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పిల్లాపాపలతో, ముల్లెమూటలతో రోడ్డుమీద కూర్చుండబెడుతున్న దారుణాలపై శాపనార్థాలు పెడుతున్నారు.

రేవంత్ సర్కార్ పై దుమ్మెత్తిపోస్తున్న జనం..
పెద్దోళ్లను వదిలి.. పేదలపై ప్రతాపమని మండిపాటు..
దూకుడుకు తట్టుకోలేక ఆగుతున్న గుండెలు..
ఇల్లు కూలుస్తారనే కంగారుతో మహిళా ఆత్మహత్య..
ఎక్కడికక్కడ నిరసనలు., రాస్తారోకోలు.., బైఠాయింపులు..
మూసీ పరివాహమంతా ఉద్రిక్త వాతావరణం..
పలుచోట్ల చేతులెత్తేసిన పోలీసులు..
రంగనాథ్ కు హైకోర్టు మొట్టికాయలు..
హైడ్రాతో సర్కార్ కు అపఖ్యాతి..

జనపదం, బ్యూరో

రేవంత్ రెడ్డి సర్కార్ పై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. పేదోళ్లను పట్టించుకుంటూ, పెద్దోళ్లను వదులుతున్న తీరుపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బీదవాడికి కాస్తోకూస్తో మంచి చేయాల్సింది పోయి పూర్తిగా బట్టలతో రోడ్డుపై నిలబెతున్న తీరును ఎండగడుతున్నారు. హైడ్రా పేరుతో తమను ఎటు కాని వారిగా చేస్తున్నారని, పైసాపైసా పోగేసి కట్టుకున్న ఇండ్లను కనికరం లేకుండా కూల్చుతూ బిచ్చగాళ్ల మాదిరిగా చేస్తున్నాడని ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

ఎక్కడికక్కడ నిరసనలు., రాస్తారోకోలు.., బైఠాయింపులు..
హైడ్రా బాధితుల ధర్నా ఉద్రిక్తతగా మారింది. తమకు న్యాయం చేయాలని లంగర్ హౌస్ ఠాణా పరిధిలో రింగ్ రోడ్డుపై డిఫెన్స్ కాలనీ వాసులు బైఠాయించారు. ఈ క్రమంలో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమకు అన్యాయం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఎంత నచ్చజెప్పినా వినకుండా రోడ్డపైనే బాధితులు బైఠాయించారు.

మూసీ పరివాహమంతా ఉద్రిక్త వాతావరణం..
హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పురా నియోజకవర్గం పరిధిలోని కిషన్ బాగ్,అసద్ బాబానగర్, నంది ముసలైగూడ మూసీ రివర్ బెడ్ పరిధిలో నివసిస్తున్న సుమారు 387 కుటుంబాలు తమ ప్రాంతాల నుంచి ర్యాలీగా వచ్చి బహదూర్పురా తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. తమ ఇళ్లను కూల్చవద్దని డిమాండ్ చేశారు. తమకు వేరే చోట ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూం ఇళ్లు అవసరం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పలువురు స్థానికులు వారికి మద్ధతుగా రావడంతో నిరసనకారులతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. కాగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి మూసీ రివర్ బెడ్లోకి వస్తున్న ఇళ్లలో ఉన్న వారి వివరాలు సేకరించి మార్కింగ్ చేసి బాధితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

హైడ్రా.. గో బ్యాక్
హైడ్రా అధికారుల సర్వే ఉద్రిక్తతకు దారి తీస్తోంది. ఎక్కడికక్కడ అధికారులను బాధితులు అడ్డుకుంటున్నారు. హైడ్రా బాధితుల కోసం కొత్తపేటలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ధర్నాకు దిగారు. ఈటల చేపట్టిన ధర్నాకు బాధితులు భారీగా తరలివచ్చారు. మరోవైపు 5 బృందాలుగా విడిపోయి అధికారులు సర్వే చేస్తున్నారు. ముసారంబాగ్, సత్యనగర్‌, వినాయక్‌నగర్‌, వీవీనగర్‌, భవానీనగర్‌, నాగోల్‌ వైపు గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా ఇళ్లకు మార్కింగ్‌ చేస్తున్నారు. బిల్డింగ్‌ ఉన్న వాళ్లకు డబుల్‌ బెడ్రూం కేటాయిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 30 ఇళ్లకు మార్కింగ్‌ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 8 ఇళ్లకు మార్కింగ్‌ పూర్తి చేశారు.

కూకట్ పల్లిలో మహిళా ఆత్మహత్య…
హైడ్రా దూకుడు తట్టుకోలేక పేద గుండెలు ఆగుతున్నాయి. పలువురు మనస్తాపంతో తీవ్ర అనారోగ్యాల బారిన పడుతూ మంచానికే పరిమితం అవుతున్నారు. బీదవారికి మానసికంగా ధైర్యం కల్పించాల్సిన సర్కార్ ఉన్న ఇండ్లను కాస్త కూల్చుతుండడంతో ఏమీ చేయలేక, ఎవరికి చెప్పుకోలేక మనస్తాపంతో ఆత్మహ్యతాయత్నాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా హడల్ కి మహిళ ఆత్మహత్య చేసుకుంది. కూకట్ పల్లి యాదవ బస్తీలో గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గుర్రంపల్లి శివయ్య బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కూతుర్లు. ముగ్గురు బిడ్డలకు పెళ్ళీలకు కట్నంగా ముగ్గురికి ఇండ్లు కట్నంగా ఇచ్చారు. కూల్చివేతల్లో భాగంగా ఇండ్లు ఖాళీ చేయాలని హైడ్రా అధికారులు హెచ్చరించడంతో బిడ్డలకు ఇచ్చిన ఇండ్లు కూలిపోతాయనే మనస్తాపంతో బుచ్చమ్మ ఉరేసుకొని చనిపోయింది.

RELATED ARTICLES

తాజా వార్తలు