Thursday, April 3, 2025
HomeBusinessPM Kisan | పీఎం కిసాన్ డ‌బ్బులు.. రైతుల ఖాతాల్లో ప‌డేదెప్పుడు?

PM Kisan | పీఎం కిసాన్ డ‌బ్బులు.. రైతుల ఖాతాల్లో ప‌డేదెప్పుడు?

న్యూఢిల్లీ: ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ యోజ‌న‌ (PM Kisan) కు సంబంధించిన 17వ విడుత డ‌బ్బులు మ‌రికొన్ని రోజుల్లో రానున్నాయి. రైతులకు పంట సాయం కింద, వారిని ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి సంవత్సరం రూ. 6 వేలు అర్హులైన రైతులకు కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న‌ది. దీనిని 3 విడుతలుగా ప్రతి 4 నెలలకు ఒక‌సారి రూ.2 వేల చొప్పున‌ రైతుల ఖాతాల్లో జ‌మ చేస్తూ వ‌స్తున్న‌ది. 16వ విడుత డబ్బులను గ‌త ఫిబ్రవరిలో విడుద‌ల చేసింది. అర్హులైన 9 కోట్ల మందికిపైగా లబ్ధిదారుల కోసం ఒక‌ విడతలోనే రూ. 21 వేల కోట్లకుపైగా వెచ్చించింది.

అయితే 17వ విడుత నగదు మొత్తం వ‌చ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్న‌ది. దేశ‌వ్యాప్తంగా లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ ద‌ఫా పీఎం కిసాన్ డ‌బ్బుల‌ విడుద‌ల‌పై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎన్నిక‌లు పూర్త‌యిన రాష్ట్రాల్లోని రైతుల‌కు ఇస్తారా లేదా దేశ‌వ్యాప్తంగా ఒకేసారి అంద‌రి పంపిణీ చేస్తారా అనే విష‌యం తెలియాల్సి ఉన్న‌ది. కాగా, ఎన్నికల నేపథ్యంలో వీలైనంత ముందుగానే అకౌంట్లలోకి డబ్బులు వస్తాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ‌, ఏపీలో మే 13న ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే.

పంట సాయానికి ఈ-కేవైసీ తప్పనిసరి

పీఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం ఈ ప‌థ‌కం కింది న‌మోదైన‌ రైతులకు కేంద్రం ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది. పీఎం కిసాన్ పోర్టల్‌లో ఓటీపీ ద్వారా ఇది అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ బీఆర్ డీ ఈకేవైసీ కోసం సమీపంలోని సీఎస్‌సీ సెంటర్లల‌లో సంప్రదించవచ్చు.

RELATED ARTICLES

తాజా వార్తలు