Sunday, December 29, 2024
HomeTelanganaPM Modi | ఆర్‌ ట్యాక్స్‌ అంటే.. ముఖ్యమంత్రి ఎందుకు వివరణ ఇస్తున్నరు..? ప్రశ్నించిన మోదీ

PM Modi | ఆర్‌ ట్యాక్స్‌ అంటే.. ముఖ్యమంత్రి ఎందుకు వివరణ ఇస్తున్నరు..? ప్రశ్నించిన మోదీ

PM Modi | కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఆర్‌ ట్యాక్స్‌పై చర్చ జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఒక ఆర్‌ తెలంగాణ అయితే.. రెండో ఆర్‌ ఢిల్లీదన్నారు. అయితే, తాను ఎవరి పేరు చెప్పకపోయినా సీఎం (రేవంత్‌) వచ్చి వివరణ ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఆర్ అంటే రజాకార్ అని.. ఈ డబుల్ ఆర్ కలిసి హైదరాబాద్‌ను, తెలంగాణను ఏటీఎం చేసేశారని మండిపడ్డారు. రజాకార్ ట్యాక్స్ ఎలా ఉంటుందో పాతబస్తీకి తెలుస్తుందన్నారు. ఎల్‌బీ స్టేడియంలో జరిగిన భాగ్యనగర్‌ జనసేనలో ప్రధాని పాల్గొన్నారు. అక్షయ తృతీయ శుభాకాంక్షలు చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు హైదరాబాద్‌ చాలా ప్రత్యేకమన్నారు. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా బీజేపీకి ఓటేస్తామంటున్నారని.. ఎక్కడకు వెళ్లినా ఒకటే మాట వినిపిస్తోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ వద్దని బీజేపీకి మాత్రమే ఓటు వేస్తామని చెబుతున్నారన్నారు. 140 కోట్లమంది సంకల్పం గెలుస్తుందని.. జూన్ 4న దేశం తెలుగుస్తుందన్నారు. ట్రిపుల్ తలాక్‌ను, ఆర్టికల్ 370ని వ్యతిరేకించిన వారంతా ఓటమి చూడడం ఖాయమన్నారు. ఉద్యోగం, స్టార్టప్స్, పరిశ్రమలు ఇదీ మోదీ ట్రాక్ రికార్డ్ అని.. కానీ లూటీ చేయడం, సంతృష్ట రాజకీయాలు, వారసత్వం కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో దిల్‌సుఖ్‌నగర్ వరుస బాంబు పేలుళ్లు అందరికీ గుర్తుకు వస్తున్నాయని.. ఢిల్లీలో బలమైన ప్రభుత్వం వచ్చాకే బాంబు పేలుళ్లు ఆగిపోయావన్నారు.

కాంగ్రెస్ హయాంలో ఎక్కడికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు అలాంటి పేలుళ్లు జరుగుతున్నాయా? అంటూ ప్రశ్నించారు. బాంబు పేలుళ్లు బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆగిపోయాయన్నారు. అందుకే మోదీని తొలగించాలని చాలామంది కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. దేశం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకూడదన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు ఇచ్చింది బీజేపీయేనన్నారు. మీ సంపదను లాక్కునే వారు మీకు కావాలా? మీ సంపదను కాపాడేవారు కావాలా? ఎంచుకోవాలన్నారు. కాంగ్రెస్‌కి ఓటు వేయడమంటే మళ్లీ పాతరోజులను కావాలని కోరుకున్నట్లేనని.. యువరాజుకు ట్యూషన్ చెప్పే ఓ నేత రామనవమి చేసుకోవడం తప్పని చెప్పారని.. రాముడికి పూజ చేయడం తప్పా? దేశద్రోహమా?అంటూ విమర్శలు గుప్పించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు