Friday, April 4, 2025
HomeNationalPM Modi | వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ..

PM Modi | వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ..

PM Modi | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కుల‌ను ప్రధాని చెల్లించుకున్నారు. అనంతరం అనంత‌రం ప్రధానిని వేద పండితులు ఆశీర్వచనం చేసి.. తీర్థ ప్రసాదాల‌ను అందజేశారు. స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. అంతకు ముందు ఆలయానికి వచ్చిన ప్రధానికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని తెలంగాణ పర్యటకు వచ్చారు. ఇవాళ వేములవాడతో పాటు వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని.. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాని.. బుధవారం ఉదయం వేములవాడకు బయలుదేరారు. అక్కడి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత వరంగల్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు