PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది మైసూర్‌లో పర్యటించారు. స్థానిక హోట్‌లో ఆయన బస చేశారు. హోటల్‌కు ఇప్పటికీ రూ.80.6లక్షల బిల్లు పెండిందని వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం హోటల్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో హోటల్ యాజమాన్యం చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలను హెచ్చరించాయి. వివరాల్లోకి వెళితే.. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA), పర్యావరణ, అటవీ శాఖ మార్పుల మంత్రిత్వ శాఖ (MOEF) ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 2023 ఏప్రిల్ మాసంలో మైసూర్ వెళ్లారు.
ఏప్రిల్ 9 నుంచి 11వ తేదీ వరకు వరకు రూ.3కోట్ల వ్యయంతో ప్రధాని మోదీ కార్యక్రమం చేపట్టాలని ఆ రాష్ట్ర అటవీశాఖ ఆదేశాలు వచ్చాయి. కార్యక్రమానికి కేంద్రం తరఫున వందశాతం నిధులు సమకూర్చనున్నట్లు కేంద్రం హామీ ఇచ్చింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికార యంత్రాంగం ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మొత్తం వ్యయం రూ.6.33 కోట్లకు పెరిగింది. కేంద్రం తరఫున రూ.3కోట్లు విడుదల చేసింది. కర్ణాటక అటవీ శాఖ, ఎంఓఈఎఫ్‌ల మధ్య సమాచార మార్పిడి జరిగినా ఇంకా రూ.3.33కోట్ల లోటు ఏర్పడింది.
ఆ తర్వాత సంబంధిత అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసగగా పర్యటన మొత్తం ఖర్చు రూ.3కోట్లు, అయితే, ఎన్‌టీసీఏ అధికారుల సూచలన మేరకు ప్రధాని కార్యక్రం, అవసరాల ప్రకారం అదనంగా కొన్ని కార్యక్రమాలను జోడించారు. దాంతో ప్రోగ్రామ్‌ను అవుట్‌సోర్స్ చేసిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ సవరించిన రేట్లకు సంబంధించిన జాబితాను సమర్పించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులందరికీ అందించగా.. బిల్లులు చెల్లించాలని కర్ణాటక సంబంధిత అధికారులకు లేఖ రాశారని తెలిసింది.
ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) కర్ణాటక అధికారులు 2023 సెప్టెంబర్ 29న న్యూ ఢిల్లీలోని ఎన్‌టీసీఏ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు లేఖ రాసి బకాయిలపై గుర్తు చేసింది. అయితే, 2024 ఫిబ్రవరి 12న నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ స్పందిస్తూ మైసూర్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ప్రధాని నరేంద్ర మోదీ బస చేసినందుకు కర్ణాటక ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని చెప్పింది. 2024 మార్చి 22న మరో లేఖను ప్రస్తుత పీసీసీఎఫ్ సుభాష్ మరోసారి లేఖ రాశారు. మైసూరులోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ప్రధాని నరేంద్ర మోదీ బస చేసిన హోటల్ బిల్లులను క్లియరెన్స్ చేయకపోవడంతోపాటు రూ.80.6 లక్షల బకాయిలు ఉన్నాయని ఎన్‌టీసీఏకు ఆయన గుర్తు చేశారు.
ఇప్పటి వరకు అధికారుల నుంచి మళ్లీ స్పందన కరువైంది. ఈ క్రమంలో రాడిసన్ బ్లూ ప్లాజా జనరల్ మేనేజర్ ఆఫ్ ఫైనాన్స్ అధికారులు ఈ నెల 21న డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి బసవరాజుకి లేఖ రాశారు. హోటల్ సేవలను పొంది ఏడాది దాటిన బిల్లులు చెల్లించడం లేదని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులపై నోటీసులు ఇచ్చినా చెల్లించలేదన్నారు. బకాయిలపై ఆలస్యంగా చెల్లించనందుకు 18శాతం వడ్డీ వర్తిస్తుందని.. అందుకే పెండింగ్ బిల్లులతో పాటు రూ.12.09 లక్షలు చెల్లించాల్సిందేనని మరో లేఖ రాశారు.
జూన్ 1వ తేదీలోగా బిల్లులు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హోటల్ యాజమానం సంబంధిత అధికారులను హెచ్చరించింది. ఈ బిల్లుల వ్యవహారంపై డిప్యూటీ కన్జర్వేటర్ బసవరాజును సంప్రదించగా.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేందుకు నిరాకరించింది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమని.. ఆ మొత్తాన్ని చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను అధికారులు తోసిపుచ్చారు.