నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్వాలలు రగిల్చిన యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. కవి దాశరథి కృష్ణమాచార్య శత జయంతి (22-07-2024) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు
తెలుగు, ఉర్దూ, సంస్కృత, ఇంగ్లీష్ భాషల్లో పండితుడైన దాశరథి తన కలం నుంచి ఓ వైపు విప్లవాగ్నులను రగుల్చుతూనే, మరోవైపు అనువాద, ప్రణయ కవిత్వాలను, సినీ గీతాలను వెలువరించిన సవ్యసాచి అని పేర్కొన్నారు. దాశరథి పోరాట పటిమ మలి దశ తెలంగాణ ఉద్యమ పోరాటానికి, పోరాట సాహిత్యానికి స్ఫూర్తిగా నిలిచిందని ముఖ్యమంత్రి కొనియాడారు.