Lok Sabha Elections | రాష్ట్ర వ్యాప్తంగా మరో అర్ధ గంటలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) ముగియనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. అయితే కామారెడ్డి జిల్లా పిప్రియాల్ తండాలో మాత్రం 3 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఓటేసేది లేదని తండా ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. దీంతో ఆ గ్రామంలో ఒక్క ఓటు కూడా నమోదుకాలే.
పోలింగ్ సిబ్బంది పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో.. వారు తండాకు చేరుకున్నారు. అధికారులు నచ్చజెప్పడంతో ఓటు వేయడానికి ఒప్పుకున్నారు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు చెప్పారు.