Pooja Hegde | పూజాగా హెగ్డే ‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ బుట్టబొమ్మగా మారింది. స్టార్ హీరోల సరసన నటించి అగ్ర హీరోయిన్ స్థాయికి చేరింది. ఇటీవల పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెక్ కాపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. మొన్నటి వరకు లక్కీ బ్యూటీగా మారగా.. ప్రస్తుతం వరుస డిజాస్టర్లతో ఐరన్ లెగ్‌గా మారింది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నది.
అలాగే, ప్రియుడితో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ బుట్టబొమ్మకు ఓ డైరెక్టర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. హీరోయిన్‌కి తల్లి క్యారెక్టర్ చేయాలని.. అందుకు భారీ రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే, ఈ ఆఫర్‌కు పూజ ఓకే చెప్పిందని టాక్. పూజా హెగ్డే నిర్ణయంతో అందరూ షాక్ అవుతున్నారు.
రెమ్యునరేషన్ కోసం కెరీర్‌ను రిస్క్‌లో పడేసుకుంటుందోమో అంటున్నారు. ఇందులో ఎంత వాస్తవమున్నదో తెలియాల్సి ఉంది. పూజా హెగ్డే చివరిసారిగా 2022లో వచ్చిన ఆచార్య సినిమాలో కనిపించింది. అలాగే, ఎఫ్3 మూవీలో ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేసినా ఏమాత్రం కలిసిరాలేదు. ప్రస్తుతం హిందీలో దేవా చిత్రంలో నటిస్తున్నది.