Prabhas| టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు హీరోలు మంచి స్నేహబంధం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వారిలో ప్రభాస్-గోపిచంద్ కూడా తప్పక ఉంటారు. వీరి స్నేహం వర్షం సినిమా కంటే ముందే మొదలయ్యింది. వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా,గోపిచంద్ విలన్‌గా నటించారు. వారిద్దరి వల్లే ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా సమయంలో వారిద్దరి ఫ్రెండ్షిప్ మరింత స్ట్రాంగ్‌గా కూడా అయింది. వర్షం తర్వాత ప్రభాస్, గోపిచంద్ కలిసి సినిమా చేసింది లేదు. అయితే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తామని అంటున్నారు. ఆ మధ్య బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి ప్రభాస్, గోపిచంద్ జంటగా హాజరయ్యారు. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అయితే ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డట్టు కూడా ఆ షోలో గోపిచంద్ చెప్పుకొచ్చాడు.
ఇక తాజాగా గోపిచంద్, ప్రభాస్ మధ్య జరిగిన గొడవకి సంబంధించిన వార్త వైరల్‌గా మారింది. ప్రభాస్ ఓ సారి గోపిచంద్ ముక్కు మీద కొడితే పగిలిపోయిందట. ప్రభాస్ నవ్వుతున్నప్పుడు మనుషులని పక్కకి నెట్టే అలవాటు ఒకటి ఉంటుందట. అలా గోపీచంద్‌ని అలా తరచూ నెడుతుండడం, కొట్టడం కూడా చేస్తుంటాడట. అయితే గోపిచంద్‌కి ఈ విషయం తెలుసు కాబట్టి నవ్వితే కొట్టొద్దు జాగ్రత్తగా ఉండమని చెబుతాడట. కాని డార్లింగ్ ఆ రోజు విషయం మరిచిపోయి గోపిచంద్ ముక్కు మీద కొట్టాడట. కారులో పోతున్న సమయంలో ఏదో జోక్ గుర్తు తెచ్చుకొని ఇద్దరు నవ్వుకున్నారు. ఆ సమయంలో గోపిచంద్ ముక్కు మీద గుద్దే సరికి ముక్కు నుండి రక్తం వచ్చిందట.అప్పుడు గోపిచంద్ చాలా కూల్‌గా తన ముక్కు నుండి కారుతున్న రక్తాన్ని తుడుచుకున్నాడు తప్ప సీరియస్ కాలేదు.
అరేయ్ ఏంట్రా ఇది, కొంచెం చూసుకోరా అని మాత్రమే అని సైలెంట్ అయ్యాడట. గోపిచంద్ చాలా మంచోడు, అస్సలు చిరాకు పడడు అని అతని మంచితనం గురించి ఓ రేంజ్‌లో చెప్పుకొచ్చాడు ప్రభాస్. విషయం తెలిసిన నెటిజన్స్ ఇద్దరి మధ్య బాండింగ్, గోపిచంద్ గొప్ప మనసుని పొగిడేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల భీమా చిత్రంతో అలరించిన గోపిచంద్ ఇప్పుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో విశ్వం అనే పేరుతో సినిమా చేస్తున్నారు. ఈ మూవీతో అయితే మంచి కమర్షియల్ హిట్ కొట్టాలని అనుకుంటున్నడు గోపిచంద్. ఇక ప్రభాస్ చేతిలో కల్కి2898ఏడీ, ది రాజా సాబ్ చిత్రాలున్నాయి. `కన్నప్ప`లో గెస్ట్ రోల్ చేస్తుండగా, ఇటీవలే మూవీ సెట్ లో అడుగుపెట్టాడు.