Praveen, Faima| బుల్లితెరపై కామెడీ పంచే కొన్ని క్రేజీ జంటలలో ప్రవీణ్, ఫైమా జంట ఒకటి. వీరిద్దరు పటాస్ షోతో పరిచయం కాగా, ఆ తర్వాత జబర్ధస్త్‌కి వెళ్లి అక్కడ అద్భుతమైన స్కిట్ లు చేసి అందరినీ అలరించారు. ఇక కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ మొదలైందని తెలిపారు. ఫైమా బిగ్ బాస్ షోకి వెళ్లినప్పుడు అతడే తన లవర్ అని రివీల్ చేసింది. తను కష్టాలలో, ఇబ్బందులలో ఉన్నప్పుడు తోడు నీడగా ఉంటాడని కూడా పేర్కొంది. ఇక హౌజ్ నుండి బయటకు వచ్చాక ప్రవీణ్.. ఫైమాకి ఓ చైన్ కూడా ఇచ్చాడు. అంతవరకు వీరిద్దరి జర్నీ బాగానే సాగింది. ఇక బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తర్వాత ఫైమా.. ప్రవీణ్‌తో కనిపించిన సందర్భాలు లేవు. దీంతో వారిద్దరు విడిపోయారని అందరు అనుకున్నారు.
అయితే ఓ ఇంటర్వ్యూలో ప్రవీణ్.. ఫైమా కోసం తాను ఎప్పుడు ఎదురు చూస్తుంటానని చెప్పాడు. అంటే ఆమెపై ఇంకా ప్రేమ ఉందని ఇన్‌డైరెక్ట్‌గా తెలియజేశాడు. అయితే ఫైమా మాత్రం ఇప్పుడు ప్రవీణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రవీణ్ నా మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని పేర్కొంది. బుల్లితెరపై జోడీగా కనిపించే జంటలకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కొన్ని స్క్రిప్ట్ ల వరకు మాత్రమే ఉంటుంది. మా జంటని చాలా మంది ఆదరించారు, ఆశీర్వదించారు. అందుకే మేము విడిపోయాం అంటే వారికి కొంత బాధ ఉండవచ్చు. ప్రవీణ్ కొన్ని సందర్భాలలో చెప్పే మాటలు బ్యాడ్ చేస్తాయి. అది ఏ మాత్రం కరెక్ట్ కాదు అని ఫైమా పేర్కొంది
తాము నిజమైన ప్రేమికులు కాదని ఫైమా అప్పట్లో కామెంట్ చేసింది. తర్వాత మాత్రం తమ మధ్య బంధం ఉందని పేర్కొంది. వాటి గురించి తర్వాత చెబుతానని అంటుంది ఫైమా. ప్రేమించుకుంటున్నామంటూ ఇద్దరు పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు కదా అని యాంకర్ అడగగా, వేరే జంటలు కూడా ఇలా మాట్లాడినవి కదా అని అంది. వారి గురించి కాదు మీ గురించి చెప్పమన్నప్పుడు మా మధ్య బందని అంది, పెళ్లెప్పుడు అంటే అంతా ఆ దేవుడికే వదిలేసానంటూ ఫైమా కీలక వ్యాఖ్యలు చేసింది. చూస్తుంటే ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగి ఉంటుందని, అందుకే దూరమై ఉంటారని కొందరు భావిస్తున్నారు.