Narendra Modi | అహ్మదాబాద్ : దేశ వ్యాప్తంగా మూడో విడుత పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోదీ వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
అహ్మదాబాద్‌లోని నిషాన్ హ్యాయర్ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో మోదీ ఓటేశారు. ఈ నేపథ్యంలో ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మోదీ వైట్ కుర్తా, సఫ్రన్ కలర్ జాకెట్ ధరించి, పోలింగ్ కేంద్రానికి వచ్చారు.
పోలింగ్ కేంద్రం నుంచి బయటకొచ్చిన తర్వాత మోదీ స్థానికులతో ముచ్చటించారు. జనాలకు ప్రధాని అభివాదం చేశారు. పోలింగ్ బూత్ వద్ద ఉన్న చాలా మందికి మోదీ తన ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఓ చిన్నారి తన చేతులతో వేసిన మోదీ పెయింటింగ్‌ను ప్రధానికి అందించారు. ఆ చిన్నారిని మోదీ అభినందించారు.
#WATCH | Prime Minister Narendra Modi casts his vote for #LokSabhaElections2024 at Nishan Higher Secondary School in Ahmedabad, Gujarat pic.twitter.com/i057pygTkJ
— ANI (@ANI) May 7, 2024