Punarnavi Bhupalam| పునర్నవి.. ఈ భామ బిగ్ బాస్ హౌజ్‌లో చేసిన రచ్చ అంత ఈజీగా మరిచిపోలేం. రాహుల్‌ని తన వెనుక తిప్పుకుంటూ తెగ హంగామా చేసింది. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ బిగ్ బాస్ షోతో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. కాని ఆ క్రేజ్‌ని నిలబెట్టుకోలేకపోయింది అని చెప్పాలి. రాహుల్ పునర్నవి జోడికి వచ్చినంత క్రేజ్ ఇంత వరకు తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో ఏ జోడికి రాలేదు అనే చెప్పాలి. ఆ సమయంలో చూసిన వారంతా కూడా ఈ ఇద్దరు నిజంగా ప్రేమలో మునిగి తేలుతున్నారా అని అనుకున్నారు. పైకి బెస్ట్ ఫ్రెండ్స్ చెబుతున్నా వారు చేసే పనులు జనాలకి అలా కనిపించేవి కావు.
అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎక్కువగా ఈ ఇద్దరూ కలిసి కనిపించలేదు. ఎవరికి వారు తమ కెరీర్‌పై దృష్టి పెట్టారు. పునర్నవి ఒకటి రెండు వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఆ తర్వాత పై చదువుల కోసం అని విదేశాలకి వెళ్లింది. తన అభిమానుల కోసం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది. తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఫోటోలో పునర్నవి ఆ అబ్బాయితో చాలా క్లోజ్‌గా కనిపిస్తూ ఉంది. ఇక ఆ ఫోటోకి కామెంట్‌గా బర్త్ డే విషెస్ పెట్టింది. ఇండియన్ రిజర్వేషన్ అనే విజింట్ ప్రదేశం దగ్గర ఓ అబ్బాయితో కలిసున్న ఫోటో పునర్నవి అతనితో చాలా రొమాంటిక్ మూడ్‌లో ఉన్నట్టు కనిపించింది.
గతంలో పునర్నవి ఆ కుర్రాడితో కనిపించిన దాఖలు లేవు. ఆ కుర్రాడి పేరు కూడా సందేశంలో పొందుపరచలేదు కాని, అతనితో చాలా సన్నిహితంగా ఉండడం చూసి పునర్నవి ప్రియుడు అయి ఉంటాడని చాలా మంది భావిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ 28 ఏళ్ల కుర్రాడు ఎవరనే చర్చ నెట్టింట జోరుగా జరుగుతుంది. పునర్నవి బాయ్ ఫ్రెండ్ అని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంటే పునర్నవినే దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా పునర్నవి 2013లో విడుదలైన ఉయ్యాలా జంపాలా మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది . ఆ సినిమాలో అవికా ఫ్రెండ్ రోల్ లో అలరించింది..అనంతరం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, పిట్టగోడ, మనసుకు నచ్చింది… చిత్రాలు చేసింది.