Pushpa2| పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా మారాడు. పుష్ప చిత్రం అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కి ఎన్ని సంచలనాలు సృష్టించిందో మనం చూశాం. ఈ సినిమాలో బన్నీ డైలాగ్స్, పాటలు ఫ్యాన్స్‌కి మాంచి కిక్ అందించాయి. ఇక తగ్గేదే లే అనే డైలాగ్‌ని సామాన్యులతో పాటు సినిమా ప్రముఖులు కూడా అనుకరించడం మనం చూశాం. ”పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా .. ఫైర్ అబ్బా ” అన్న డైలాగుకి కూడా మంచి గుర్తింపు లభించింది. పుష్ప సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్స్‌ని ఇప్పుడు రాజకీయ ప్రచారాలలో కూడా వాడడం మనం చూస్తూ ఉన్నాం. పుష్పకి వచ్చిన క్రేజ్‌తో పుష్ప2ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు సుకుమార్.ఇప్పటికే పుష్ప 2కి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు మూవీపై అంచనాలు పెంచాయి.
పుష్ప టీజర్, మాతంగి గెటప్‌లో వున్న అల్లు అర్జున్ గెటప్‌కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనం చూశాం. ఇక మూవీ ఆగస్ట్ 15న విడుదల కానున్న నేపథ్యంలో సుకుమార్ ప్రచార స్పీడ్ పెంచాడు. తాజాగా మూవీ ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ సంగీత ప్రియులని ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో బన్నీ, రష్మిక లుక్స్ కూడా అదరహో అనిపిస్తున్నాయి. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక పుష్ప2ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున విడుదల చేస్తుంది.ప్రమోషన్ కార్యక్రమాల కోసం పశ్చిమ బెంగాల్‌లోని ప్రధాన నగరాలకు కూడా వెళ్లి అక్కడ కూడా మూవీని బాగా ప్రమోట్ చేయాలని అనుకుంటుంది.
పుష్ప2తో వెయ్యి కోట్లు కొట్టాలని నిర్మాతలు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇంతకాలం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఏకకాలంలో విడుదల చేసి పాన్ ఇండియా మూవీగా చెప్పేవాళ్లు. కాని ప్పుడు పుష్ప2 సరికొత్త చరిత్ర రాస్తుంది. ఈ మూవీ బెంగాలీ బాషలో కూడా రిలీజ్ అవుతుంది. బెంగాలీలో విడుదల అవుతున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. అక్కడి ప్రేక్షకులని అలరించేందుకు అండర్ వాటర్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను మేకర్స్ చిత్రీకరించినట్టు వార్తలు వచ్చాయి. ఏది ఏమైన ఈ సారి మాత్రం పుష్ప2 మరెన్నో ప్రభంజనాలు పుట్టించడం ఖాయంగా కనిపిస్తుంది.
Cheer and celebrate the arrival of PUSHPA RAJ with the #PushpaPushpa chant ❤️🔥#Pushpa2FirstSingle out now 💥
Telugu 🎶 – https://t.co/iTjnKxx2VD
Hindi 🎶 – https://t.co/JNNxEj5i91
Tamil 🎶 – https://t.co/e7XBwbkPXP
Kannada 🎶 – https://t.co/Y8DW2cXVTO
Malayalam 🎶 -… pic.twitter.com/4YPi8l7nfj— Mythri Movie Makers (@MythriOfficial) May 1, 2024