Pushpa2| లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప2. తొలి పార్ట్ మంచి విజయం సాధించడంతో ఇప్పుడు పుష్ప2ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్లాన్ చేస్తున్నారు.ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న చిత్రాన్ని విడుదల చేయనుండడంతో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ ఇలా ప్రతీది సినిమా రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఫస్ట్ సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్‌తో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇక ఇప్పుడు రెండో సాంగ్‌కి టైం ఫిక్స్ చేశారు మేకర్స్.
పుష్పరాజ్‌తో శ్రీవల్లి స్టెప్పులేసే సాంగ్ అనౌన్స్‌మెంట్ వీడియోను గురువారం ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు. పోస్టర్‌లో రష్మిక చేతిని మాత్రమే చూపించి అంచనాలు పెంచారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. తొలి పార్ట్‌కి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన దేవి ఇప్పుడు సెకండ్ పార్ట్ కి అంతకు మించి ఇస్తున్నాడు. ఇక చిత్రంలో అనసూయ, ఫహాద్ ఫాజిల్, సునీల్‌తో సహా మరికొంతమంది స్టార్ నటీ నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాతో బన్నీ రేంజ్ మరింత పెరగడం ఖాయం అంటున్నారు.
ఇక ఈ మూవీ విడుదలకు ఇంకా మూడు నెలలే టైమ్ ఉంది. అంటే 90 రోజులు మాత్రమే. కానీ షూటింగ్ ఇంకా నడుస్తూనే ఉంది. మిగిలిన షూట్ ఎప్పుడు పూర్తి చేస్తారు..? ప్రమోషన్ ఎప్పుడు మొదలు పెడతారు..? అసలు రాబోయే 90 రోజుల్లో పుష్ప మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉంది అనే దానిపై ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తుంది. ఆఘమేఘాల మీద అన్నీ పూర్తి చేస్తే కానీ అనుకున్న టైమ్‌కు పుష్ప 2 రావడం కష్టమే అని అంటున్నారు. పుష్పకు కూడా చివరి నిమిషం వరకు ఇలాగే పని చేసింది టీం. మంచి ఔట్‌పుట్ రావడంతో ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అయ్యారు.