Thursday, April 3, 2025
HomeTelanganaఓటు హ‌క్కు వినియోగించుకున్న పీవీ న‌ర‌సింహారావు కుమార్తె

ఓటు హ‌క్కు వినియోగించుకున్న పీవీ న‌ర‌సింహారావు కుమార్తె

హైద‌రాబాద్ : భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు కుమార్తె జ‌య హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటు హ‌క్కు క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రూ ఓటు వేయండి. ఓటు చాలా విలువైన‌ది. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం పాటు ప‌డే అభ్య‌ర్థిని గుర్తించి ఓటు వేయండి. అది ప్ర‌తి పౌరుడి బాధ్య‌త అని జ‌య పేర్కొన్నారు.

తెలంగాణ‌లో 17 లోక్‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. మొత్తం 17 స్థానాల‌కు 525 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. ఓట‌ర్లు అభ్య‌ర్థుల భ‌విత‌వ్యాన్ని ఈవీఎంల‌లో నిక్షిప్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు