Sunday, December 29, 2024
HomeNationalRahul Gandhi | కాంగ్రెస్‌ కొన్ని తప్పులు చేసింది..! రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Rahul Gandhi | కాంగ్రెస్‌ కొన్ని తప్పులు చేసింది..! రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Rahul Gandhi | కాంగ్రెస్‌ పార్టీ కొన్ని తప్పులు చేసిందని.. పార్టీలో మార్పులు జరగాల్సి ఉందన్నారు. ఈ మాట తాను కాంగ్రెస్ వ్యక్తిగా చెబుతున్నానన్నారు. లక్నోలో సమృద్ధ్‌ భారత్‌ ఫౌండేషన్‌ ‘సంవిధాన్‌ సమ్మేళన్‌’ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో కాంగ్రెస్‌ తన రాజకీయాలను మార్చుకోవాల్సి ఉందన్న ఆయన.. ఎలాంటి మార్పులను ఆశిస్తున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ చక్రవర్తి అని.. ప్రధాని కాదన్నారు. ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారుల కోసం మాత్రమే పని చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఫైనాన్షియర్ల కోసమే మోదీ ఫ్రంట్ పనిచేస్తుందని విమర్శించారు.

లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ 180 సీట్లకే పరిమితమవుతుందని అభిప్రాయపడ్డారు. మళ్లీ మోదీ ప్రధాని కాలేరని.. అవసరమైతే లిఖితపూర్వకంగా రాసిస్తానన్నారు. కొందరు వ్యక్తులు అధికారం ఎలా పొందాలో మాత్రమే ఆలోచిస్తారని.. తాను పుట్టిందే దాంట్లోనన్నారు. తనకు అధికారంపై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. అధికారం అనేది ప్రజలకు సాయపడే సాధనమన్న రాహుల్‌.. 90శాతం మందిని కలుపుకోకుంటే దేశం బలపడడం సాధ్యం కాదన్నారు. 90శాతం మంది ఉద్యోగాలు, క్రీడలు, మీడియా, న్యాయవ్యవస్థ, అందాల పోటీల్లోకి కూడా అడుగు పెట్టలేదన్నారు. జనాభాలో కేవలం 10శాతం మందిని సూపర్ పవర్‌గా మార్చాలనుకుంటున్నారా? అంటూ బీజేపీని ప్రశ్నించారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు