Sunday, December 29, 2024
HomeHealthRaisins Benefits | ఎండు ద్రాక్షతో ఆ స‌మ‌స్యకు చెక్..! ఇంకెన్ని లాభాలో తెలుసా..?

Raisins Benefits | ఎండు ద్రాక్షతో ఆ స‌మ‌స్యకు చెక్..! ఇంకెన్ని లాభాలో తెలుసా..?

Raisins Benefits | ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు. రెగ్యుల‌ర్‌గా ఎండు ద్రాక్ష‌ను తింటే.. అనేక ర‌కాల పోష‌కాలు శ‌రీరానికి అందిన‌ట్లే. ఇక దాంప‌త్య జీవితానికి కూడా ఎండు ద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది. మ‌గాళ్లు ఎండుద్రాక్ష‌ను తిన‌డంతో భార్య‌కు ఎంతో మ‌ధురానుభూతిని కూడా ఇవ్వొచ్చు. ఈ ఎండు ద్రాక్ష‌లు సీజ‌న్‌తో సంబంధం లేకుండా ఏ కాలంలోనైనా దొరుకుతాయి. ఎండు ద్రాక్ష‌లో విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, ఫైబ‌ర్ పుష్క‌లంగా ల‌భిస్తాయి. అంతేకాకుండా ఇవి బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్‌గా ప‌ని చేస్తాయి. మరి ఎండుద్రాక్షలను తినడం ద్వారా ఇంకా ఏయే ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు తెలుసుకుందాం.

ఎండు ద్రాక్షల వ‌ల్ల లాభాలివే..

  • ఎండు ద్రాక్ష‌ల‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకునే పురుషుల్లో వీర్య క‌ణాల సంఖ్య పెరుగుతుంది. రోజు పాల‌తో క‌లిపి ఎండ్రు ద్రాక్ష‌ల‌ను తింటే అంగ స్తంభ‌న మెరుగవుతుంది. దీంతో దంప‌తులు సుఖ‌మ‌య‌మైన జీవితాన్ని గ‌డ‌పొచ్చు. శృంగారం స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఎండు ద్రాక్ష తింటే ఎంతో మేలు క‌లుగుతుంది.
  • ఎండు ద్రాక్ష‌లో మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం, ఫోలేట్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఎముక‌ల‌ను బ‌లోపేతం చేస్తాయి. దీంతో కీళ్ల వాపు నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు. కాబ‌ట్టి కీళ్ల వాపు నుంచి ఉప‌శ‌మ‌నం పొందాల‌న్నా, ఎముక‌లు ధృఢంగా మారాల‌న్నా ఎండు ద్రాక్ష‌లు తింటే బెట‌ర్.
  • మ‌రి ముఖ్యంగా ర‌క్త నాళాలు గ‌డ్డ క‌ట్టుకుపోతే.. ప‌లుచ‌గా చేసే గుణం ఎండు ద్రాక్ష‌లో ఉంటుంది. ఎండు ద్రాక్ష‌లో ఉండే రిస్‌వెర‌టాల్ ర‌సాయ‌నం ర‌క్తాన్ని ప‌లుచగా చేస్తుంది. దీంతో ర‌క్త‌పోటు త‌గ్గి.. గుండెకు మేలు క‌లుగుతుంది.
  • ఎండు ద్రాక్ష‌లో అధికంగా పీచు ఉంటుంది. ద్రాక్ష‌ను తింటే ఆక‌లిగా అనిపించ‌దు. ఎక్కువ‌సేపు క‌డుపు నిండిన భావ‌న క‌లిగిస్తుంది. కొవ్వును క‌రిగించే లెప్టిన్ హార్మోన్ మోతాదు పెరిగేలా చేస్తుంది. ఇది జీవ‌క్రియ‌ల వేగాన్ని పెంచుతుంది. ఇవ‌న్నీ బ‌రువు త‌గ్గ‌డానికి తోడ్ప‌డుతాయి.
  • ఎండుద్రాక్షలు ఐరన్‌ను అధికంగా కల్గి ఉంటాయి. కాబట్టి రక్తహీనతతో బాధపడేవాళ్లకు ఇది చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఐరన్ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇంకా ఐరల్ లోపాన్ని కూడా అధిగమించవచ్చు.
  • ఎండుద్రాక్షలో ఆమ్ల జనకాలు సమృద్ధిగా ఉంటాయి. తద్వారా ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, నష్టాన్నితగ్గించడానికి సహాయపడతాయి. ఇంకా కళ్ల కింద చారలు, చర్మపు ముడతలను నిరోధిస్తుంది. ఎండు ద్రాక్ష చర్మ క్యాన్సర్‌ను నివారించడానికి కూడా సహాయపడుతుంది.
  • ఎండుద్రాక్షలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి ఎందుకంటే అవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. ఇంకా మధుమేహం ఉన్నవారికి ఇది ఓ మంచి ఆరోగ్యకరమైన చిరుతిండిగా ఉంటుంది.
RELATED ARTICLES

తాజా వార్తలు