Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి ఆయన ఏం చేసిన సెన్సేషన్. తనదైన టాలెంట్‌తో అందరిని అబ్బురపరుస్తుంటారు. రాజమౌళి టాలెంట్‌కి హాలీవుడ్ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోతున్నారు. స్టూడెంట్ నెం1 సినిమాతో డైరెక్టర్‌గా మారిన రాజమౌళి ఆ తర్వాత ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు. రాజమౌళి సినిమా వస్తుందంటే ప్రపంచం మొత్తం కూడా ఆయన సినిమాపై ప్రత్యేకమైన ఫోకస్ పెడుతుంది. అయితే ఆర్ఆర్ఆర్‌తో వండర్స్ క్రియేట్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో రాజమౌళికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.
ఇప్పటి వరకు దర్శకుడిగా మాత్రమే తన టాలెంట్ చూపించిన రాజమౌళి.. తాజాగా తనలోని డ్యాన్సింగ్ కళను బయటకు తీసుకువచ్చారు. తన భార్య రమాతో కలిసి ఓ స్టేజి పై డాన్స్ అదరహో అనిపించారు. ప్రభుదేవా సినిమాలోని ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే’ పాటకు చాలా శ్రద్ధగా డ్యాన్స్ చేశారు. సతీమణి రమతో కలిసి రాజమౌళి చేసిన ఈ రిహార్సల్ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. వాటే ఏ టాలెంట్ అంటూ ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చాలా స్టైలిష్‍గా, గ్రేస్‍తో ఆయన స్టెప్స్ వేశారని పొడుగుతున్నారు. తన తదుపరి సినిమాలలో రాజమౌళి డ్యాన్స్‌తో కూడా అలరిస్తాడేమో చూడాలి అని కొందరు అంటున్నారు.
ఇక రాజమౌళి గ్లోబల్ రేంజ్‍లో భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా మహేష్ బాబుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ.1,000 కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందనుందని అంచనాలు ఉన్నాయి. . ఇండోనేషియా నటి చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ కీలకపాత్ర పోషించనుందని తెలుస్తుంది. ఈమెతో పాటు పలువురు హాలీవుడ్ ప్రముఖులు కూడా ఇందులో భాగం కానున్నారు. ఈ సినిమాకు సుమారు రెండేళ్లకు పైగా సమయం పట్టొచ్చని తెలుస్తుంది . 2026 రెండో అర్ధ భాగంలో లేకపోతే 2027 మొదట్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని టాక్.
SS Rajamouli Dance 👌
— Christopher Kanagaraj (@Chrissuccess) April 11, 2024