Wednesday, January 1, 2025
HomeCinemaRajamouli| ఆ డైరెక్ట‌ర్‌ని ముసుగు వేసి కొడితే 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి బంప‌ర్...

Rajamouli| ఆ డైరెక్ట‌ర్‌ని ముసుగు వేసి కొడితే 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి బంప‌ర్ ఆఫ‌ర్

Rajamouli| ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెలుగు సినిమా స్థాయిని పెంచిన ద‌ర్శ‌కుడు. ఆయ‌న ఇంత వ‌ర‌కు ఒక్క ఫ్లాప్ కొట్టింది లేదు. చేసిన ప్ర‌తి సినిమాని కూడా అత్య‌ద్భుతంగా తెర‌కెక్కిస్తూ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతూ ఉంటాడు. ఇక రాజ‌మౌళి వివాదాల‌కి కూడా దూరంగా ఉంటాడు.కాంట్ర‌వ‌ర్సీస్‌కి కూడా దూరం. అయితే ఆయ‌న ఓ డైరెక్ట‌ర్‌ని ముసుగేసి కొడితే వాళ్లకి రూ. 10 వేలు ఇస్తా అంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. అయితే రాజ‌మౌళి ఎవ‌రిని కొట్ట‌మ‌న్నాడు, అందుకు గ‌ల కార‌ణ‌మేంట‌నేది ఈ న్యూస్ చ‌దివితే మీకు ఒక క్లారిటీ వ‌స్తుంది.

సత్యదేవ్‌ హీరోగా రూపొందిన యాక్షన్‌ ఫిల్మ్​ కృష్ణమ్మ చిత్రాన్ని మే10న విడుద‌ల చేయ‌నున్నారు. వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొదిన‌ ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్​ కొరటాల శివ సమర్పించారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో మూవీ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇక ఈ కార్యక్ర‌మానికి దర్శకులు రాజమౌళి, అనిల్‌ రావిపూడి, గోపీచంద్‌ మలినేని చీఫ్ గెస్ట్​లుగా వెళ్లారు. ఇక ఈవెంట్‌లో అనీల్ రావిపూడి మాట్లాడుతూ..రాజ‌మౌళి గారు సినిమాని మొద‌లు పెట్టిన రోజే క‌థ చెబుతారు. ఇప్పుడు #SSMB29 ఏ జానరో తెలుసుకోవాలని ఎంతో ఆస‌క్తిగా ఉంది. ఈ విషయం గురించి ఇప్పుడు ఈ వేదికపై చెబుతారని అనుకుంటున్నాను అని అనీల్ రావిపూడి ఫ‌న్నీ కామెంట్ చేశారు.

ఇక అనీల్ రావిపూడి కామెంట్‌పై వెంట‌నే స్పందించిన రాజ‌మౌళి.. ఎవరైనా అనిల్‌పై ముసుగేసి కొడితే వాళ్లకి రూ. 10 వేలు ఇస్తానంటూ న‌వ్వులు పూయించారు. స‌ర‌దాగా వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఈ సంభాష‌ణ అక్క‌డున్న వారిని కూడా ఆనంద‌ప‌రిచింది. ఇక సినిమా గురించి రాజ‌మౌళి మాట్లాడుతూ..ఈ చిత్రం మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు. స‌త్య‌దేవ్ ఏ పాత్ర‌లో అయిన ఇట్టే ఒదిగిపోతారు. ఆయ‌న టాలెంట్ మ‌నంద‌రికి తెలుసు.ఈ సినిమా త‌న‌కి మంచి పేరు తీసుకొస్తుంద‌ని అనుకుంటున్నాను అని జక్క‌న్న తెలిపారు. ఐపీఎల్‌ను రెండు, మూడు రోజులు పక్కనపెట్టేసి థియేటర్లకు వెళ్లి సినిమాను చూడండి అంటూ అనీల్ రావిపూడి ప్రేక్ష‌కుల‌ని కోరారు.

RELATED ARTICLES

తాజా వార్తలు