Friday, January 3, 2025
HomeCinemaRakul Preet Singh|భ‌ర్త‌తో హ‌నీమూన్‌కి వెళ్లిన ర‌కుల్‌.. బికినీలో మాములు ర‌చ్చ చేయ‌లేదుగా..!

Rakul Preet Singh|భ‌ర్త‌తో హ‌నీమూన్‌కి వెళ్లిన ర‌కుల్‌.. బికినీలో మాములు ర‌చ్చ చేయ‌లేదుగా..!

Rakul Preet Singh| ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తెలుగులో అవ‌కాశాలు అందుకోలేక‌పోతుంది. బాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ కోసం ట్రై చేస్తుంది. బాలీవుడ్ నిర్మాత అయిన జాకీ భగ్నానీతో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపి ఇటీవల ఫిబ్రవరిలో అత‌డిని పెళ్లి చేసుకుంది. పెళ్ళికి ముందు తర్వాత కూడా ఈ జంట నిత్యం వార్త‌లలో నిలుస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్‌గా ఈ జంట హనీమూన్‌కి వెళ్లారు. వ‌ర్క్ బిజీ, ఇత‌ర‌త్రా కార‌ణాల వ‌ల్ల‌నో ఏమో తెలియ‌దు కాని పెళ్లి తర్వాత హనీమూన్‌ కి ఎక్కడికి వెళ్ళలేదు.

పెళ్లి తర్వాత రెండు నెలలకు హనీమూన్ కోసం ఫిజి దేశానికి వెళ్లారు రకుల్ – జాకీ జంట‌. పస్‌ఫిక్ సముద్రంలో ఉన్న చిన్న దేశం ఫిజి ఐస్‌ల్యాండ్స్ లో సముద్రాలు, బీచ్ లు చాలా అందంగా ఉంటాయి. అక్క‌డి అందాల‌ని ఈ ఇద్ద‌రు ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ర‌కుల్ అయితే మ‌రోసారి బికినీలో క‌నిపించి ర‌చ్చ చేసింది.పెళ్లి తర్వాత కూడా అందాల ప్రదర్శనలో ఏ మాత్రం త‌గ్గ‌ని ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బికినీలో ఇలా క‌నిపించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ర‌కుల్ బికినీ పిక్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. బీచ్‍కు సెట్ అయ్యేలా ప్లంగింగ్ బ్రాలెట్, హైవెస్ట్ బాటమ్ ధరించి ర‌కుల్ ఇచ్చిన పోజులు తెగ వైర‌ల్ అవుతున్నాయి.

గతంలోనూ ఈ భామ‌ తన బీచ్‍ లుక్‍లను సోషల్ మీడియాలో పంచుకుంటూ కుర్రాళ్ల‌కి కాక రేపింది. ర‌కుల్ క్యూట్ లుక్స్‌పై నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో నటిస్తున్న ఈ అందాల సుంద‌రి కాస్త విరామం దొరికితే చాలు టూర్లతో తెగ ఎంజాయ్ చేస్తుంది. అయితే ర‌కుల్ వివాహం తర్వాత సినిమాలు తగ్గించి .. వ్యాపారం రంగంలో బిజీగా మారింది. ఇప్పుటికే ఉన్న తన బిజినెస్‌లను విస్తరించే పనిలో పడింది.ఇటీవల ఫుడ్ బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో ఆరంభం పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించింది. మిల్లెట్స్‌తో తయారు చేసేన వంటకాలను ఈ హోటల్‌లో అందించనున్నారు. ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్న నేప‌థ్యంలో ఇందులో ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువ‌గా స‌ప్ల‌య్ చేస్తారు

RELATED ARTICLES

తాజా వార్తలు