Thursday, January 2, 2025
HomeCinemaRakul Preet Singh | హైదరాబా‌ద్‌లో మరో కొత్త వ్యాపారం మొదలుపెడుతున్న రకుల్‌..!

Rakul Preet Singh | హైదరాబా‌ద్‌లో మరో కొత్త వ్యాపారం మొదలుపెడుతున్న రకుల్‌..!

Rakul Preet Singh | టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే.. మరో వైపు పలు వ్యాపారాలను నిర్వహిస్తున్నది. ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టింది ఢిల్లీ బ్యూటీ. రకుల్‌ ఇప్పటికే పలు వ్యాపారాలతో ఫుల్‌ బిజీగా ఉన్నది. హైదరాబాద్‌, విశాఖపట్నంతోపాటు పలునగరాల్లో ‘ఎఫ్‌ 45’ పేరిట జిమ్స్‌ను నిర్వహిస్తున్నది. దాంతో పాటు వెల్‌బీయింగ్‌ న్యూట్రిషన్‌, వెల్‌నెస్‌ న్యూట్రిషన్‌ బ్రాండ్స్‌లోనూ పెట్టుబడులు పెట్టింది. 2019లో న్యూబూ పేరుతో బయోడీగ్రేడబుల్, రీయూజబుల్ డైపర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

తాజాగా ఫుడ్‌ బిజినెస్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ‘ఆరంభం’ పేరుతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఈ నెల 16న ఓ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నది. ప్రముఖ కిచెన్ ఆపరేటర్ ‘క్యూర్‌ఫుడ్స్’ కొలాబరేషన్‌తో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నది. ఇందులో తృణధాన్యాలతో తయారుచేసే వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఫుడ్‌బిజినెస్‌లో కాలుమోపుతుండడంపై రకుల్ సంతోషం వ్యక్తం చేసింది. రెస్టారెంట్ ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని.. అందరికీ న్యూట్రిషన్ అందించాలన్నదే ఈ రెస్టారెంట్ లక్ష్యమని చెప్పింది. ‘ఆరంభం’లో ఫుడ్ శరీరానికి మాత్రమే కాదని, ఆత్మ(మనసు)కు కూడా అని చెప్పింది.

RELATED ARTICLES

తాజా వార్తలు