Sunday, December 29, 2024
HomeTelanganaRamoji Rao | రామోజీరావు క‌న్నుమూత‌

Ramoji Rao | రామోజీరావు క‌న్నుమూత‌

ఈనాడు సంస్థ‌ల చైర్మ‌న్ రామోజీరావు(87) నాన‌క్‌రామ్‌గూడ‌లోని స్టార్ హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు.

ఆయ‌న శుక్ర‌వారం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను నాన‌క్‌రామ్‌గూడ‌లోని స్టార్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఆయ‌నకు వెంటిలేట‌ర్‌పై చికిత్స అందించారు. గ‌త కొంత‌కాలంగా రామోజీరావు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇటీవ‌లే ఆయ‌న‌కు గుండె సంబంధిత చికిత్స నిమిత్తం స్టంట్ వేశారు.

రామోజీ రావు మృతి పట్ల నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

ఈనాడు సంస్థలను స్థాపించి ఎంతో శ్రమించి..వాటిని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన శ్రమజీవి రామోజీరావు గారని గుర్తుచేశారు.

ఈనాడు సంస్థల ద్వారా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారని… ఎంతో మందికి ఆర్థిక సహాయాలు, పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించారని అన్నారు

తెలుగు టెలివిజన్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన సృజనాత్మక రూపశిల్పి రామోజీరావు గారని…Etv న్యూస్ ద్వారా జర్నలిజానికి సరైన అర్థం చెప్పారని.. ఎన్నో న్యూస్ ఛానెల్స్ కు డిక్షనరీగా మారిన రామోజీరావు గారు లేరనే సత్యం జీర్ణించుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు

రామోజీరావు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు