Thursday, April 3, 2025
HomeCinemaRamoji Rao| రామోజీరావు మృతికి కార‌ణాలు ఏంటి.. స‌మాధిప్రాంతాన్ని ముందే ఎంపిక చేసుకున్నాడా..!

Ramoji Rao| రామోజీరావు మృతికి కార‌ణాలు ఏంటి.. స‌మాధిప్రాంతాన్ని ముందే ఎంపిక చేసుకున్నాడా..!

Ramoji Rao| మీడియా మొఘల్‌గా జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు ఈ రోజు తెల్ల‌వారుఝామున అనారోగ్యకార‌ణాల‌తో క‌న్నుమూసిన విషయం తెలిసిందే. శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన‌ట్టు ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్లడించాయి. ఆయన మ‌ర‌ణ వార్త చాలా మందిని శోక‌సంద్రంలోకి నెట్టింది. రామోజీరావు మరణం పట్లు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పురందేశ్వరి, కిషన్ రెడ్డి తదితరులు ఆయ‌న‌కి సంతాపం తెలియ‌జేస్తూ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.

అయితే రామోజీరావు గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు రోజుల నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు స్టెంట్ వేయాలని సూచించారు. స్టంట్ వేసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. రామోజీరావు ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న‌ని వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .రామోజీరావు మృతికి ఏపీలోని గత ప్రభుత్వం, వైయస్ జగన్మోహన్ రెడ్డి చర్యలే కారణమంటూ నట్టి కుమార్ తీవ్రవ్యాఖ్యలు చేశారు.

రీసెంట్ గా కూటమి తరుపున ఎలక్షన్స్ లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ కృష్ణ రాజు ..రామోజీరావుకు నివాళులు అర్పిస్తూ కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశారు. రామోజీరావు గారు తన సమాధి కోసం రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఓ ప్రదేశాన్ని ఎన్నో సంవత్సరాల క్రితమే ఎంపిక చేసుకున్నారని చెప్పుకొచ్చి ఆశ్చర్యపరిచారు. ఆ సమాధి ప్రాంతాన్ని ఓ ఉద్యానవనంలా మార్చాలని ఆయ‌న చెప్పిన‌ట్టు తెలియ‌జేశారు. రామోజీరావుకి మొక్క‌లంటే చాలా ఇష్టం. అందుకే రామోజీఫిలిం సిటీ లాంటి అంద‌మైన ప్రాంతాన్ని ఆయ‌న సృష్టించారు. రామోజీ రావు పత్రికా, డిజిటల్ రంగంలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసి నూతన ఒరవడి సృష్టించారు. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు.. ఎంతో మంది నూతన నటీనటులను వెండితెరకు పరిచయం చేశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు