Saturday, December 28, 2024
HomeTelanganaRamoji Rao | రామోజీ రావుకు తీవ్ర అస్వ‌స్థ‌త‌.. వెంటిలేట‌ర్‌పై చికిత్స‌

Ramoji Rao | రామోజీ రావుకు తీవ్ర అస్వ‌స్థ‌త‌.. వెంటిలేట‌ర్‌పై చికిత్స‌

Ramoji Rao | హైద‌రాబాద్ : ఈనాడు సంస్థ‌ల చైర్మ‌న్ రామోజీరావు(87) తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను నాన‌క్‌రామ్‌గూడ‌లోని స్టార్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌నకు వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తున్నారు. గ‌త కొంత‌కాలంగా రామోజీరావు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇటీవ‌లే ఆయ‌న‌కు గుండె సంబంధిత చికిత్స నిమిత్తం స్టంట్ వేశారు.

శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో రామోజీరావు అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు స‌మాచారం. వయస్సు రీత్యా పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రామోజీరావు. 24 గంటలు గడిస్తే కానీ అతడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసే అవకాశం ఉంది. కాగా రామోజీ రావు మీడియాతోపాటు అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనాడు సంస్థలు, రామోజీ ఫిల్మ్‌ సిటీ, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌, ప్రియా ఫుడ్స్‌ వంటి వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీ రావు నడిపిస్తున్నారు. తెలుగు మీడియాలో ప్రధానమైన ఈనాడు సంస్థ ఆయన ఆధ్వర్యంలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

RELATED ARTICLES

తాజా వార్తలు