ART| మాస్ మహరాజా రవితేజ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. ఆ పై చిన్ని పాత్రలతో తెరంగేట్రం చేసి తన మ్యానరిజంతో ఎంతగానో ఆకట్టుకున్న హీరో రవితేజ. సినిమా తప్పితే మరే కోరికలు లేకుండా పెరిగాడు రవితేజ. మాస్ మహరాజా మొదట నీ కోసం సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో రవితేజ మంచి హిట్ అందుకున్నాడు. 2012 రవితేజ కేరీర్ కు గట్టి పునాది వేసిన సంవత్సరం. ఆ ఏడాది వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఔను వాళ్లిద్దరు ఇష్ట పడ్డారు’ హిట్టైతే… ‘ఇడియట్’ సినిమా సూపర్ హిట్ అయి రవితేజ పేరు మారుమ్రోగేలా చేసింది.
ఇక ఆ తర్వాత రవితేజ వెంట ఆఫర్స్ క్యూ కట్టాయి. బెంగాల్ టైగార్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని రాజ ది గ్రేట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత రవితేజ సినిమాల వేగం పెంచాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రైడ్’కి ఇది రీమేక్ గా రూపొందుతుండగా, ఈ మూవీపై అంచనాలు భారీగానే పెట్టుకున్నాడు. ఇక తన 75వ సినిమాని ‘సామజవరగమన’ రచయిత భాను బొగ్గవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులకి నచ్చేలా ఉంటుందట.
అయితే రవితేజ ఇప్పుడు మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సౌత్ లో ‘ఏషియన్ సినిమాస్’ సంస్థ మల్టీప్లెక్స్ బిజినెస్ లో స్టార్ హీరోలకు భాగస్వామ్యం కల్పిస్తూ..దూసుకుపోతుంది.. ఇప్పటికే మహేష్ బాబుతో AMB, విజయ్ దేవరకొండతో AVD, అల్లు అర్జున్ తో AAA సినిమాస్ మల్టీప్లెక్స్ లు నిర్మించగా, ఇప్పుడు రవితేజతో ART పేరిట ఈ మల్టీప్లెక్స్ ని ప్రారంభించనున్నారు. దిల్‌షుఖ్ నగర్‌లో ఇది నిర్మితం కానుంది. తాజాగా ఈ మల్టీప్లెక్స్ నిర్మాణంకి సంబంధించిన పూజ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రవితేజ కూతురు మోక్షధ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమెని చూసిన వారందరు హీరోయిన్ పీస్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు