Sunday, December 29, 2024
HomeSportsRCB| ఆర్సీబీ హ్యాట్రిక్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుందా?

RCB| ఆర్సీబీ హ్యాట్రిక్ విక్ట‌రీ.. ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుందా?

RCB| ఐపీఎల్ సీజ‌న్ 17 చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో ప్లే ఆఫ్ చేరే జ‌ట్ల విష‌యంలో కాస్త స‌స్పెన్స్ నెల‌కొంది. ముంబై ఇప్ప‌టికే ప్లేఆఫ్స్ నుండి బ‌య‌టకు పోగా, మిగతా జ‌ట్లు మాత్రం పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్సీబీ జ‌ట్టు గ‌త మూడు మ్యాచ్‌ల‌లో మంచి విజ‌యాలు సాధించి ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకుంది. మే 4న జ‌రిగిన మ్యాచ్‌లో గుజరాత్ విధించిన 148 పరుగుల లక్ష్యాన్ని కేవ‌లం 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.దీంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్‌ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఆర్సీబీ బౌల‌ర్స్ అత్యుత్త‌మైన బౌలింగ్, కోహ్లీ మెరుపు ఫీల్డింగ్‌తో గుజ‌రాత్‌ని త‌క్కువ స్కోరుకే క‌ట్ట‌డి చేసింది ఆర్సీబీ జ‌ట్టు. ముందు గుజ‌రాత్ టీం బ్యాటింగ్ చేయ‌గా, వారికి శుభారంభం ద‌క్క‌లేదు.

పవర్‌ప్లేలో 23 పరుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల‌లో ప‌డింది ఆర్సీబీ జ‌ట్టు. అయితే ఐపీఎల్‌ చరిత్రలో గుజరాత్‌కు ఇదే అత్యల్ప పవర్‌ప్లే స్కోరు కూడా. మూడు వికెట్స్ ప‌డిన త‌ర్వాత షారూఖ్ ఖాన్((37; 24 బంతుల్లో, 5×4, 1×6) , డేవిడ్ మిల్లర్ (30; 20 బంతుల్లో, 3×4, 2×6) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్ర‌య‌త్నం చేశారు. నాలుగో వికెట్‌కు 37 బంతుల్లో 67 పరుగులు జోడించారు. అయితే మిల్ల‌ర్ అప్ప‌టికే ఆర్సీబీపై ఎదురు దాడి మొద‌లు పెట్టాడు. ఆ స‌మ‌యంలో కర్ణ్ శర్మ 12వ ఓవ‌ర్‌లో అద్భుత‌మైన బంతితో ఔట్ చేశాడు. ఇక ఆ త‌ర్వాత విరాట్ కోహ్లీ వేసిన మెరుపు త్రోకి షారూఖ్ ఖాన్ కూడా పెవీలియ‌న్ చేశారు. ఇక 87 ప‌రుగుల‌కి ఐదు వికెట్స్ కోల్పోయిన స‌మ‌యంలో రాహుల్ తెవాతియా (35; 21 బంతుల్లో, 5×4, 2×6), రషీద్ ఖాన్ (18; 14 బంతుల్లో, 2×4, 1×6) కాస్త ప్ర‌తిఘ‌ట‌న చేసి చెప్పుకోద‌గ్గ స్కోరు చేశారు.

ఇక 148 ప‌రుగులు ల‌క్ష్య చేధ‌న‌తో బ‌రిలోకి దిగిన ఆర్స‌బీ మొదటి నుండి దాడి మొద‌లు పెట్టింది. ముఖ్యంగా కెప్టెన్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో, 10×4, 3×6) , విరాట్ కోహ్లి (42; 27 బంతుల్లో, 2×4, 4×6) దొరికిన బంతిని బౌండ‌రీకి త‌ర‌లిస్తూ స్కోరు వేగాన్ని పెంచారు. వీరిద్ద‌రు ఉన్నంత సేపు ఆర్సీబీ విజ‌యం ఈజీ అన్న‌ట్టుగా మారింది. కాని ఫాఫ్ డుప్లెసిస్ ఔటైన తర్వాత ఆర్సీబీ కేవలం 25 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల‌లో ప‌డింది.. విల్ జాక్స్ 1, రజత్ పాటిదార్ 2, గ్లెన్ మాక్స్‌వెల్ 4 మరియు కామెరాన్ గ్రీన్ 1 త‌క్కువ స్కోరుకి పెవీలియ‌న్ బాట ప‌ట్టారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఆ తర్వాత దినేష్ కార్తీక్, స్వప్నిల్ సింగ్ కాస్త నెమ్మ‌దిగా ఆడుతూ జ‌ట్టుని విజ‌య‌తీరాల‌కి చేర్చారు. దినేష్ కార్తీక్ 12 బంతుల్లో 21 పరుగులు చేసి అజేయంగా నిల‌వ‌గా, స్వప్నిల్ సింగ్ 15 పరుగులు చేశాడు. ఇక గుజరాత్ తరఫున జాషువా లిటిల్ 4 వికెట్లు తీయ‌గా, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు.

RELATED ARTICLES

తాజా వార్తలు