RCB vs CSK| ఇన్ని రోజులు జరిగిన మ్యాచ్‌లు ఒక ఎత్తైతే, నేడు జరిగే మ్యాచ్ మరో లెవల్. ఐపీఎల్ 2024లో మరో రసవత్తర సమరం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. రాత్రి 7:30 నిమిషాలకు చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుండగా, ఈ రెండు జట్లలో ఏ జట్టు ప్లేఆఫ్స్‌కి చేరుకుంటుంది. ఎవరు నిష్క్రమిస్తారు అనేది ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికే 3 జట్లు కేకేఆర్, రాజస్థాన్, ఎస్ఆర్‌హెచ్ జట్లు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం RCB, CSK పోరాడుతున్నాయి. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం మారడంతో.. హైఓల్టేజ్ యాక్షన్ తప్పదని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు. ప్లేఆఫ్ చేరాలి అంటే ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకంగా కూడా మారుతుంది.
రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఆడుతున్న సీఎస్కే ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడింది.. ఇందులో 7 గెలిచి, 6 ఓడిపోయింది. వారి దగ్గర పాయింట్లు 14 ఉన్నాయి. ఇక ఫాఫ్ డూప్లెసిస్ నేతృత్వంలోని ఆర్సీబీ.. 6 విజయాలు, 7 పరాజయాలతో మొత్తం 12 పాయింట్స్ సంపాదించుకుంది. వరుసగా గెలుస్తూ ఇక్కడి వరకు వచ్చిన ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేస్‌లో నిలవాటి అంటే సీఎస్కేపై విజయం సాధించడమే కాదు.. భారీగా గెలవాల్సి ఉంటుంది. అప్పుడు రన్ రేట్ ఆధారంగా ప్లే ఆఫ్‌స్‌కి వెళతారు. ఒకవేళ సీఎస్కే విజయం సాధిస్తే.. 16 పాయింట్లతో ఆ జట్టు డైరెక్ట్‌గా ప్లేఆఫ్స్కి వెళుతుంది. ఒక వేళ సీఎస్కే ఓడిపోయినా.. ప్లేఆఫ్స్ రేస్‌లో అయితే ఉంటుంది. కాకపోతే ఆర్సీబీ చేతులో దారుణంగా ఓడిపోకుండా ఉంటే చాలు. రన్ రేట్ ఇప్పుడు రెండు టీమ్‌లకి కీలకం.
గెలుపు, ఓటములు పక్కన పెడితే వర్షం వలన మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటనే అనుమానాలు కూడా అందరిలో ఉన్నాయి. చిన్నస్వామి స్టేడియం లో శనివారం భారీ వర్ష సూచన ఉంది. ఒకవేళ మ్యాచ్ జరగకపోతే.. రెండు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. అది సీఎస్కేకి పాజిటివ్‌గా మారుతుంది. 15 పాయింట్లతో వారు ప్లేఆఫ్‌స్‌కి చేరుకుంటారు. అలా కాకుండా ఓవర్లు తగ్గించి ఆడిస్తే మాత్రం ఆర్సీబీకి చాలా దెబ్బ పడుతుంది. తక్కువ ఓవర్ల మ్యాచ్‌లో నెట్ రన్ రేట్‌ని పెంచుకోవడం చాలా కష్టం. అయితే చిన్నస్వామి స్టేడియం డ్రైనేజీ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంది.. సబ్-ఎయిర్ సిస్టమ్ కారణంగా, వర్షం ఆగిన తర్వాత కేవలం 15 నిమిషాల్లో మ్యాచ్‌ను ప్రారంభించే అవకాశం ఉంటుంది కాబట్టి
పూర్తి ఓవర్లే ఆడిస్తారని అభిమానులు భావిస్తున్నారు.